Jagga Reddy | సంగారెడ్డి నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను తరలిస్తే ఊరుకునేది లేదు.. హెచ్చరించిన జగ్గారెడ్డి
Jagga Reddy | సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల (sub registrar offices) తరలింపు ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నది. శేరిలింగంపల్లి, గండిపేట సబ్‌రిస్ట్రార్ ఆఫీసులను, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని టీహబ్‌కు తరలించాలని అధికారులు నిర్ణయించారు.
త్రినేత్ర.న్యూస్: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల (sub registrar offices) తరలింపు ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నది. శేరిలింగంపల్లి, గండిపేట సబ్‌రిస్ట్రార్ ఆఫీసులను, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని టీహబ్‌కు తరలించాలని అధికారులు నిర్ణయించారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో విరమించుకున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని (sangareddy) సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను అక్కడి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) హెచ్చరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని పొదుపు చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని సుమారు 39 ఆఫీసులను తక్షణమే అద్దె భవనాల నుంచి ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ (District Registrar), పట్టణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మరో చోటికి తరలించాలని నిర్ణయించారు. ఈ విషయమై జగ్గారెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు.
ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుతో పటాన్‌చెరులోని కర్ధనూర్‌కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారని.. దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.అవసరమైతే సంగారెడ్డిలో ఉన్న పటాన్‌చెరు సంబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పటాన్‌చెరుకు తీసుపోవచ్చని సూచించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో తాను మాట్లాడేవరకు తరలింపు ఆలోచన చేయొద్దన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. ఇది కేవలం సూచన కాదు.. హెచ్చరికగా పరిగణించాలని స్పష్టం చేశారు.
అద్దెల భారం తగ్గించుకోవడంలో భాగంగా కిరాయి భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను సొంత భవనాలలోకి లేదా ప్రభుత్వ ఖాళీ స్థలాల్లోకి తరలించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 39 కార్యాలయాలను.. టీ-హబ్, గృహకల్ప వంటి చోట్ల వీటికి ప్రత్యేక భవనాలను కేటాయించారు. అయితే టీహబ్‌లో ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయకూడదని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. దీంతో అందులో రిజిస్ట్రేషన్ కార్యాలయాల తరలిపును ఉపసంహరించుకున్నారు.
ఇక నార్సింగిలోని ఓ ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న గండిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ తరలింపును.. ఆ భవన యజమాని వ్యతిరేకించారు. తనకు కిరాయి అవసరం లేదంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తన భవనంలో కార్యాలయం ఉండటం వల్ల గ్రామానికి ఒక గుర్తింపు ఉంటుందని.. కార్యాలయాన్ని తరలిస్తే గ్రామం కళ తప్పిపోతుందని.. భవన యజమాని విజయ్ రాజ్ అధికారులకు లేఖ రాశారు. అనకు కిరాయి వద్దని, కానీ కార్యాలయాన్ని మాత్రం అక్కడి నుంచి మార్చవద్దని కోరారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






