త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | నేటికీ ఒక్క జొన్న‌ గింజ కొన‌లే: కాంగ్రెస్ స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌

KTR | రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో జొన్న (Sorghum) పంట వేస్తే.. ఇప్పటివరకు ఒక్క గింజను కూడా కొనుగోలు చేయలేదని బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో 45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న (Maize) పంట పండిస్తే.. కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నుల పంటనే కొంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి 3 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని మండిప‌డ్డారు.

S

News | Published On May 4, 2026, 3.58 pm IST

KTR | నేటికీ ఒక్క జొన్న‌ గింజ కొన‌లే: కాంగ్రెస్ స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌
Advertisement
  • 4 ల‌క్ష‌ల ఎక‌రాల్లో జొన్న‌ పంట పండింది
  • 13 ల‌క్ష‌ల ఎక‌రాల్లో మొక్క‌జొన్న సాగైంది
  • 9,500 కొనుగోలు కేంద్రాల‌కు 6 వేలే తెరిచారు
  • ధాన్యం కొన‌క నిన్న ఒక్క‌రోజే ఇద్ద‌రు రైతులు చ‌నిపోయారు
  • అవి ముమ్మాటికీ కాంగ్రెస్‌ ప్ర‌భుత్వ హ‌త్య‌లే
  • రేవంత్ ప్ర‌భుత్వంపై కేటీఆర్ ధ్వ‌జం

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో జొన్న (Sorghum) పంట వేస్తే.. ఇప్పటివరకు ఒక్క గింజను కూడా కొనుగోలు చేయలేదని బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో 45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న (Maize) పంట పండిస్తే.. కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నుల పంటనే కొంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి 3 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని మండిప‌డ్డారు. సోమ‌వారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ ప‌రిశీలించారు. రైతుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.

మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల్సి వస్తుంద‌ని..

పంటను కొనుగోలు చేస్తే మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందని అన్ని పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఈ యాసంగి సీజన్‌లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి (Paddy) కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఆ రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క వరి కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణమే పంటలను కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం అని ఆయ‌న విమ‌ర్శించారు.

రంగారెడ్డిలో గౌర‌య్య‌, మ‌హ‌బూబాబాద్‌లో వెంక‌య్య చ‌నిపోయారు..

రుణమాఫీ కాక, కరెంటు సరిగా లేక, రైతుబంధు ఇవ్వకపోయినా కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర‌ నిర్లక్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. ధాన్యం కొనుగోలు చేయకుండా అన్న‌దాత‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. నిన్న ఒక్కరోజే రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య, మహబూబాబాద్‌లో వెంకయ్య అనే ఇద్దరు రైతులు చనిపోయారు. ఇవి కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని కేటీఆర్ ఆరోపించారు.

రాష్ట్రంలో మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే కేవలం 6 వేలు మాత్రమే తెరిచారు. సంగారెడ్డి జిల్లాలో మాత్రం వరి కొనుగులు కేంద్రం ఒక్కటి కూడా పెట్టలేదు. ఆ సంస్థకు బ్యాంకులో లోన్ కూడా ఇవ్వరు. అందుకే ఇవాళ కొనుగోలు కేంద్రాలు తెరిచే పరిస్థితి లేదు. పాత పద్ధతిలోనే వడ్లు, శనగలు, జొన్నలు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

Advertisement
Advertisement