Jagadish Reddy | కాంగ్రెస్ నేతల లాగుతడుస్తంది
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం కొనసాగుతున్నదని, దాని నుంచి బయటపడేందుకే ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు కొందరు నేతలు ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
- భయపడే రాజీనామా అడుతున్నరు
- నారసింహుడిలా కేసీఆర్ వస్తడు
- అంతర్గత సంక్షోభం నుంచి బయటపడేందుకే ధర్నా
- మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం కొనసాగుతున్నదని, దాని నుంచి బయటపడేందుకే ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు కొందరు నేతలు ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో పచ్చ కాంగ్రెస్ పెత్తనం పెరుగుతుందన్న భయం అచ్చ కాంగ్రెస్‌కు పట్టుకుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్ళ ధర్నా చూస్తుంటే ప్రహ్లాదుడి ముందు ప్రగల్భాలు పలికి ఖతం అయిపోయిన రాక్షసుడులా ఉందని జగదీశ్‌రెడ్డి అన్నారు. కొండా సురేఖతో మొదలైన సంక్షోభం కొనసాగుతుందని పేర్కొన్నారు. తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందోనని శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లకు భయం అనిపిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ వస్తడు..
కేసీఆర్ సరైన సమయంలోనే వస్తారని.. సమయానికి నరసింహస్వామి ఏం చేశాడో అలాగే చేస్తాడని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు కేసీఆర్‌ను తలుచుకుంటున్నారని, కేసీఆర్ ఇప్పటికీ పేదల మనసులోనే ఉన్నాడని అన్నారు. ‘మీ గుండెల్లో కూడా కేసీఆర్ నిద్రపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం నుంచి బయటపడడం కోసమే ధర్నా డ్రామా చేస్తున్నారని విమర్శించారు. కొండా సురేఖతో మొదలైన సంక్షోభం కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిన్న జరిగిన ఆ పార్టీ సభకు రాలేదని జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘అన్న అవుట్.. తమ్ముడు ఇన్ అనే భయం ఆ మంత్రికి పట్టుకుంది’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజీనామా అడుగుతున్నారంటేనే కాంగ్రెస్ నేతలకు భయం అవుతుందని.. ‘లాగు తడుస్తుంది’ అని అర్థమవుతోందని జగదీశ్‌రెడ్డి అన్నారు.
❇️ కాంగ్రెస్ పార్టీ ధర్నాపై ఎర్రవెల్లిలో స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 👇
✳️ కాంగ్రెస్ వాళ్ళ ధర్నా చూస్తుంటే ప్రహ్లాదుడి ముందు ప్రగల్భాలు పలికి ఖతం అయిపోయిన రాక్షసుడులా ఉంది
✳️ కొండా సురేఖతో మొదలైంది.. మా పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందో అని శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లకు… pic.twitter.com/ToTzpTIlE8
— Mission Telangana (@MissionTG) September 6, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramchandar Rao | రెండేళ్ల తర్వాత ఇంకా మీరుంటరా ఏంది.. అప్పుడు మేమొస్తం
సెప్టెంబర్ 6, 2026

Harish Rao | ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర బిడ్డల గోసపై లేదా?
సెప్టెంబర్ 6, 2026

Sridhar Babu | కేసీఆర్ తీరు మారకుంటే.. బీఆర్‌ఎస్ మరో పదేండ్లు రోడ్లపైనే: మంత్రి శ్రీధర్ బాబు
సెప్టెంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Sridhar Babu | కేసీఆర్ తీరు మారకుంటే.. బీఆర్‌ఎస్ మరో పదేండ్లు రోడ్లపైనే: మంత్రి శ్రీధర్ బాబు
- ●MP Liquor Tragedy | కల్తీ మద్యం తాగి 12 మంది మృతి, 'బాంబే విస్కీ' బ్రాండ్‌పై అనుమానాలు!
- ●Deviprasad | మూడేండ్లలో ఒక్క హామీ అమలు చేయలే.. మరో రెండేండ్లు అడగడం అమానుషం: దేవీప్రసాద్
- ●Stampede | రామ్‌నగర్‌లో గణేశ్ ఆగమన్ ర్యాలీ.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- ●Bathukamma | దుబాయ్‌లో బతుకమ్మ సంబురాలు.. కేటీఆర్‌కు ఆహ్వానం
- ●PM Modi SRCC Speech | 13 ఏళ్ల తర్వాత అదే వేదిక.. మళ్లీ అదే 'గ్లాస్' కథ.. ఆ కాలేజీలో ప్రధాని మోదీ ఆసక్తికర ప్రసంగం

Sridhar Babu | కేసీఆర్ తీరు మారకుంటే.. బీఆర్‌ఎస్ మరో పదేండ్లు రోడ్లపైనే: మంత్రి శ్రీధర్ బాబు

MP Liquor Tragedy | కల్తీ మద్యం తాగి 12 మంది మృతి, 'బాంబే విస్కీ' బ్రాండ్‌పై అనుమానాలు!

Deviprasad | మూడేండ్లలో ఒక్క హామీ అమలు చేయలే.. మరో రెండేండ్లు అడగడం అమానుషం: దేవీప్రసాద్

Stampede | రామ్‌నగర్‌లో గణేశ్ ఆగమన్ ర్యాలీ.. తొక్కిసలాటలో యువకుడు మృతి



