Harish Rao | ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర బిడ్డల గోసపై లేదా?
Harish Rao | ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రంలోని విద్యార్థులు పడుతున్న గోసపై ఎందుకు లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఇంజినీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆరోపించారు.
- విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాల వేధింపులు
- సర్టిఫికెట్ల కోసం యువతను నడిరోడ్డుపై నిలబెట్టారు
- ముఖ్యమంత్రి రేవంత్‌పై ధ్వజమెత్తిన హరీశ్‌రావు
- ఫీజు రీయింబ్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
Harish Rao | ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రంలోని విద్యార్థులు పడుతున్న గోసపై ఎందుకు లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఇంజినీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆరోపించారు. సర్టిఫికెట్లు అందక ఉద్యోగాల్లో చేరలేక, పై చదువులు, విదేశీ విద్యకు వెళ్లలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మీ మాటలు కోటలు దాటుతున్నాయ్.. కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం కాలేజీ గడప దాటడం లేదు. రేపటి తెలంగాణను నిర్దేశించాల్సిన యువతను.. నేడు సర్టిఫికెట్ల కోసం నడిరోడ్డు మీద నిలబెట్టారు’ అంటూ మండిపడ్డారు. ‘ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడం మీద మీకున్న శ్రద్ధ.. ఈ రాష్ట్ర బిడ్డలు పడుతున్న గోస మీద ఎందుకు లేదు?’ అని ప్రశ్నించారు. బాధిత విద్యార్థులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇంజినీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసినా.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారని పేర్కొన్నారు.
ఆఫర్ లెటర్లు చేతిలో పట్టుకుని ఏడవాల్సిన దుస్థితి..
ఎంతో కష్టపడి చదివి కార్పొరేట్ కంపెనీల్లో రూ.6, 7 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించినా.. ఆఫర్ లెటర్లు చేతిలో పట్టుకుని సర్టిఫికెట్ల కోసం ఏడుస్తూ కూర్చోవాల్సిన దుస్థితికి ఈ పిల్లలను తీసుకొచ్చారని హరీశ్‌రావు విమర్శించారు. సర్టిఫికెట్లు లేక అటు ఉద్యోగాల్లో చేరలేక, ఇటు పై చదువులకు, విదేశాలకు వెళ్లలేక లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోందన్నారు. ‘పోనీ, ఆ ఉద్యోగం ఇచ్చిన కంపెనీలకు చూపించి కొంత సమయం అడగడానికి.. కనీసం ఆ సర్టిఫికెట్ల 'సాఫ్ట్ కాపీ'లు ఇమ్మని బతిమిలాడినా కాలేజీలు కనికరించడం లేదు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ పిల్లలు ఎందుకు బలి కావాలి?’ అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని మంచి ఉద్యోగం సాధించి తమ తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకున్న పేద విద్యార్థుల కలలను కల్లలు చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను చదివించిన తల్లిదండ్రుల ఆశలు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆవిరైపోతున్నాయని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
కేసీఆర్ రూ.20,576 కోట్లు ఇచ్చారు..
నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్న సదుద్దేశంతో కేసీఆర్ ఏనాడూ ఆపలేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.20,576 కోట్లను విడుదల చేసి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచారని చెప్పారు. ‘కానీ, అదే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మాత్రం.. ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, పేదవాడికి ఉన్నత విద్యను దూరం చేయాలని చూస్తున్నారు’ అని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంటే తనకెందుకంత కక్ష అని రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘తెలంగాణ జాతి సంపదను, ఆస్తులను ఇష్టారాజ్యంగా తెగనమ్ముకుంటున్న మీకు... లక్షల కోట్ల టెండర్లు పిలుస్తూ, కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు రాత్రికి రాత్రే వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న మీకు... ఈ పేద విద్యార్థుల ఫీజులు చెల్లించడానికి మాత్రం మనసు రావడం లేదా?’ అని నిలదీశారు. ‘మీ దగ్గర డబ్బులు లేక కాదు... దళిత, బహుజన, పేద పిల్లలు చదువుకుని పైకి రావడం మీకు ఇష్టం లేకనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారు’ అని ఆరోపించారు.
దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు..
ఒకప్పుడు ఇదే ఇంజినీరింగ్ విద్యార్థులను చూసి ‘క్రిమినల్ వేస్ట్, వీళ్లకు కనీసం అప్లికేషన్ నింపడం కూడా రాదు’ అని అత్యంత అహంకారంతో అవమానించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు అదే విద్యార్థులు తమ కష్టంతో, ప్రతిభతో ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో అత్యుత్తమ ప్యాకేజీలు సాధించారని తెలిపారు. వాళ్ల ప్రతిభ ఏంటో ఇప్పటికైనా గుర్తించి అవివేకపు మనస్తత్వాన్ని మార్చుకోవాలని సూచించారు. ‘విద్యార్థులకు వచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్లు, పై చదువుల అడ్మిషన్ లెటర్లను జత చేస్తున్నాను. ఒకసారి చూసుకో రేవంత్ రెడ్డి’ అని పేర్కొన్నారు. విద్యార్థుల చదువుల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని గుర్తుపెట్టుకోవాలని హరీశ్‌రావు అన్నారు. ఇకనైనా మొండి వైఖరి విడనాడి రోడ్డున పడ్డ పిల్లల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ‘తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలు కోల్పోతున్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తున్నాను’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jagadish Reddy | కాంగ్రెస్ నేతల లాగుతడుస్తంది
- ●Sridhar Babu | కేసీఆర్ తీరు మారకుంటే.. బీఆర్‌ఎస్ మరో పదేండ్లు రోడ్లపైనే: మంత్రి శ్రీధర్ బాబు
- ●MP Liquor Tragedy | కల్తీ మద్యం తాగి 12 మంది మృతి, 'బాంబే విస్కీ' బ్రాండ్‌పై అనుమానాలు!
- ●Deviprasad | మూడేండ్లలో ఒక్క హామీ అమలు చేయలే.. మరో రెండేండ్లు అడగడం అమానుషం: దేవీప్రసాద్
- ●Stampede | రామ్‌నగర్‌లో గణేశ్ ఆగమన్ ర్యాలీ.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- ●Bathukamma | దుబాయ్‌లో బతుకమ్మ సంబురాలు.. కేటీఆర్‌కు ఆహ్వానం

Jagadish Reddy | కాంగ్రెస్ నేతల లాగుతడుస్తంది

Sridhar Babu | కేసీఆర్ తీరు మారకుంటే.. బీఆర్‌ఎస్ మరో పదేండ్లు రోడ్లపైనే: మంత్రి శ్రీధర్ బాబు

MP Liquor Tragedy | కల్తీ మద్యం తాగి 12 మంది మృతి, 'బాంబే విస్కీ' బ్రాండ్‌పై అనుమానాలు!

Deviprasad | మూడేండ్లలో ఒక్క హామీ అమలు చేయలే.. మరో రెండేండ్లు అడగడం అమానుషం: దేవీప్రసాద్




