Uttam Kumar Reddy | ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఈ కరువు దెబ్బ తగ్గేది
Uttam Kumar Reddy | తెలంగాణ సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ కంపెనీయేనని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు.
- సాగునీటి రంగాన్ని నాశనం చేసింది కేసీఆర్ కంపెనీయే
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ప్రచారం జోసెఫ్ గోబెల్స్‌ను మించిపోయింది
- ఎల్‌నినో పరిస్థితులను రాజకీయంగా వాడుకుంటున్నారు
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరిస్తున్నం
- మీడియా సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్: తెలంగాణ సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ (KCR) కంపెనీయేనని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈరోజు ఈ కరువు ఉండేది కాదన్నారు. చివరికి ఎల్‌నినో పరిస్థితులను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు చేస్తున్న ప్రచారం జోసెఫ్ గోబెల్స్‌ను మించిపోయిందని విరుచుకుపడ్డారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు నిపుణుల ఆధ్వర్యంలో డిజైన్ల రూపకల్పన జరుగుతోందన్నారు.
మూడు బ్యారేజీల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే బీఆర్ఎస్ నేతల విషప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ దెబ్బతిన్నది బీఆర్ఎస్ హయాంలోనే. తమ ఘోర వైఫల్యాలను దాచేందుకే ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు. ఎల్‌నినో పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.
మేడిగడ్డలో డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలను గత ప్రభుత్వ హయాంలోనే ఎన్‌డీఎస్‌ఏ గుర్తించింది. పేలవమైన డిజైన్.. పేలవమైన నిర్మాణం.. మూడు బ్యారేజీల దుస్థితికి గత ప్రభుత్వ వైఫల్యాలే కారణం. బ్యారేజీల డిజైన్, నిర్మాణ వైఫల్యాలను సాంకేతిక, న్యాయ విచారణలు, విజిలెన్స్ నివేదికలు స్పష్టం చేశాయి. తమ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ విషపూరిత ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు, రైతులు నమ్మడం లేదు.
అవినీతి, కక్కుర్తి కోసం తెలంగాణ ప్రజలను, రైతాంగాన్ని బలి చేసి.. ఇప్పుడు మళ్లీ నాటకాలు ఆడుతున్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ పూర్తిచేసి ఉంటే రైతులకు కరువు కష్టాలు తగ్గేవి. పదేళ్లలో తెచ్చిన అప్పులను సద్వినియోగం చేసి ఉంటే రైతులపై ఎల్‌నినో దెబ్బ ఇంతగా పడేది కాదు. ఎల్‌నినో ప్రతికూల ప్రభావం ప్రజలు, రైతులపై ఎక్కువగా పడటానికి గత ప్రభుత్వ వైఫల్యాలే కారణం.
నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో వరి సాగు
ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల తదితర ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే కరువు పరిస్థితులను మరింత సమర్థంగా ఎదుర్కొనేవాళ్లం. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులతో ఎన్ని ఎకరాలకు నీరిచ్చారు? ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మార్చి తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా రికార్డు వరి సాగు, ధాన్యం కొనుగోళ్లు సాధించాం.
మూడు బ్యారేజీలను వినియోగించకుండానే గోదావరి బేసిన్‌లో రికార్డు స్థాయిలో సాగునీరు అందించాం. మా రెండున్నరేళ్ల పాలనలో కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి పెరిగాయి. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క నేతృత్వంలో వరి సాగు, ధాన్యం కొనుగోళ్లలో రికార్డులు నమోదయ్యాయి. బ్యారేజీల గేట్లు ఎత్తి ఉంచాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణకు దేశీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలతో ముందుకెళ్తున్నాం. బ్యారేజీల పునరుద్ధరణలో రాజకీయ దురుద్దేశం లేదు.. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. గత ప్రభుత్వ ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రచారం వెనుక వాస్తవాలను తెలంగాణ రైతాంగం గమనించాలి అని ఉత్తమ్ కోరారు.
ఈ సమావేశంలో మంత్రి జి.వివేక్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ రెడ్డి, బాలు నాయక్, మందుల సామ్యెల్, సంజీవ్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ సలహాదారు పరిక్షిత్ మెహ్రా, ఈఎన్‌సీ రమేష్‌బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BRS MLAs | కన్నెపల్లి నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలి
- ●Kajal Aggarwal | రామాయణ మూవీ నుంచి కాజల్ సీన్లు కట్ - అందుకే ప్రమోషన్లకు దూరమా?
- ●Power Grid Office | ఇదేం బుద్ధిరా నాయనా.. మహిళల వాష్‌రూమ్‌లో మొబైల్ ఫోన్‌తో అలా
- ●Ponnam Prabhakar | నామినేటెడ్ పోస్టుల్లో అడ్వకేట్లకు అవకాశం కల్పిస్తాం
- ●Mobile Public Address Systems | ప్రియమైన ప్రజలారా! నీటిని పొదుపుగా వాడండి.. కాలనీల్లో మొబైల్ మైక్‌లతో ప్రచారం షురూ
- ●Bharti Airtel | డిసెంబర్లో టెలికాం టారిఫ్‌ల పెంపు? 15 శాతం ఛార్జీల మోత..?

BRS MLAs | కన్నెపల్లి నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలి

Kajal Aggarwal | రామాయణ మూవీ నుంచి కాజల్ సీన్లు కట్ - అందుకే ప్రమోషన్లకు దూరమా?

Power Grid Office | ఇదేం బుద్ధిరా నాయనా.. మహిళల వాష్‌రూమ్‌లో మొబైల్ ఫోన్‌తో అలా

Ponnam Prabhakar | నామినేటెడ్ పోస్టుల్లో అడ్వకేట్లకు అవకాశం కల్పిస్తాం




