త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gopichand | జెట్ స్పీడ్‌లో గోపీచంద్ “సింగ” షూటింగ్ – హీరోయిన్‌గా మ‌ల‌యాళ బ్యూటీ

గోపీచంద్ సింగ షూటింగ్‌పై మేక‌ర్స్ అప్‌డేట్ ఇచ్చారు. యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ స‌గం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించారు. ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతోన్న ఈ సినిమాతో మ‌ల‌యాళ బ్యూటీ అనార్క‌లి న‌జ‌ర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

N

Entertainment | Published On Oct 24, 2026, 4.53 pm IST

Gopichand | జెట్ స్పీడ్‌లో గోపీచంద్ “సింగ” షూటింగ్ – హీరోయిన్‌గా మ‌ల‌యాళ బ్యూటీ
Advertisement

Gopichand |టాలీవుడ్ హీరో గోపీచంద్ హిట్టు అనే మాట విని ఐదారేళ్లు దాటిపోయింది. 2021లో వ‌చ్చిన సీటీమార్ త‌ర్వాత గోపీచంద్ న‌టించిన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ఈ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ప్ర‌స్తుతం హీరోగా రెండు సినిమాలు చేస్తోన్నాడు. అందులో సింగ‌ ఒక‌టి. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

యోధుడిగా...

ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో గిరిజ‌న తెగ పోరాటంతో సింగ‌ రూపొందుతోంది. ఇందులో ట్రైబ‌ల్ తెగ‌కు చెందిన యోధుడిగా గోపీచంద్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. సింగ షూటింగ్ స‌గం పూర్త‌యిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన లేటెస్ట్ షెడ్యూల్‌లో గోపీచంద్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు కొంత టాకీపార్ట్‌ను పూర్తిచేసిన‌ట్లు వెల్ల‌డించారు. నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబ‌ర్ నుంచి హైద‌రాబాద్‌లో మొద‌లుకాబోతున్న‌ట్లు పేర్కొన్నారు.

మ‌ల‌యాళీ బ్యూటీ

సింగ మూవీలో గోపీచంద్‌కు జోడీగా మ‌ల‌యాళ బ్యూటీ అనార్క‌లి న‌జ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. మ‌ల‌యాళంలో ఆరాట్టు, మోహ‌న్ కుమార్ ఫ్యాన్స్‌, రోమియోతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. సింగ‌లో అనార్క‌లి ఓ డీ గ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. సింగ మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తోండ‌గా...షామ్‌ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ స‌మ‌కూర్చుతున్నారు.

భ‌ర‌త‌వ‌ర్ష‌...

గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న మ‌రో మూవీ భ‌ర‌త‌వ‌ర్ష రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 

Advertisement
Advertisement