త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagadish Reddy | కాంగ్రెస్ పాలన దోచుకో.. దాచుకో.. పంచుకో అన్న‌ట్లుంది : జ‌గ‌దీశ్‌రెడ్డి

Jagadish Reddy | గ‌త‌వారం ప‌ది రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాలు, మీడియారంగంలో విచిత్ర‌మైన ప‌రిస్థితులు చూస్తున్నామ‌ని.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో దోచుకో.. దాచుకో.. పంచుకో అన్నట్లు ఉంద‌ని సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్‌రెడ్డి విమ‌ర్శించారు. దోచుకునే దాంట్లో పంచాయితీలు క‌నిపిస్తున్నాయ‌ని, సీఎం-మంత్రుల మ‌ధ్య దోచుకున్న పంచాయితీ న‌డుస్తుంద‌ని, ఈ గొడవ మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి మొద‌లైంద‌న్నారు.

P

Telangana | Published On Jan 18, 2026, 9.05 pm IST

Jagadish Reddy | కాంగ్రెస్ పాలన దోచుకో.. దాచుకో.. పంచుకో అన్న‌ట్లుంది : జ‌గ‌దీశ్‌రెడ్డి
Advertisement

Jagadish Reddy | గ‌త‌వారం ప‌ది రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాలు, మీడియారంగంలో విచిత్ర‌మైన ప‌రిస్థితులు చూస్తున్నామ‌ని.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో దోచుకో.. దాచుకో.. పంచుకో అన్నట్లు ఉంద‌ని సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్‌రెడ్డి విమ‌ర్శించారు. దోచుకునే దాంట్లో పంచాయితీలు క‌నిపిస్తున్నాయ‌ని, సీఎం-మంత్రుల మ‌ధ్య దోచుకున్న పంచాయితీ న‌డుస్తుంద‌ని, ఈ గొడవ మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి మొద‌లైంద‌న్నారు. ర‌వాణాశాఖ మంత్రికి తెలియ‌కుండానే జీవోలు అమ‌ల‌వుతున్నాయ‌ని అన్నార‌ని గుర్తు చేశారు. మంత్రి కొండ సురేఖ కూతురు స్వయంగా సీఎం, రెవెన్యూ మంత్రిపై ఆరోపణలు చేసింద‌ని తెలిపారు. మ‌రో మ‌హిళా మంత్రి ఇసుక అక్ర‌మ ర‌వాణా చేస్తున్నందుకు ఏకంగా పీఏను తొల‌గించార‌ని విమ‌ర్శించారు. సినిమా టికెట్ రెట్లు పెంచిన సంగతి నాకు తెలియదు అని మరో మంత్రి బహిరంగ చెప్పాడ‌ని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేద‌న్నారు.

హామీల గురించి మాట్లాడిన దాఖ‌లాలు లేవు..

ఒక్కడు అంటే ఒక్కడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడిన దాఖలాలు లేవ‌ని, 40 యేండ్లు సర్వీస్ చేసిన రిటైర్ మెంట్ ఉద్యోగులకు సరైన సమయంలో డబ్బులు ఇవ్వడం లేద‌ని ఆరోపించారు. ఉద్యోగస్తులకు ఏదో గొప్పలు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటనలు ఉన్నాయ‌ని.. దోచుకున్న డబ్బుల పంచాయతీలు రోజుకొకటి బయటపడుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆఖరికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నార‌ని.. ఒక మీడియాలో మంత్రుల, అధికారుల మధ్య వీడియోలు వ‌స్తాయ‌ని.. మరో మీడియాలో ఇంకో రకమైన వీడియోలు వ‌చ్చాయ‌న్నారు. ఈ గొడవల మధ్యలో పాలన పారదర్శకంగా నడుస్తుందని గొప్పలు చెప్పుకుంటున్నార‌ని.. ఒక్క నిమిషం ప్రజల కోసం ఆలోచన దాఖలాలు లేవ‌న్నారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు.. పంచుకునేందుకు ఒకరికి ఒకరు సహకారం ఇచ్చుకుంటున్నార‌ని.. మీరు పెంచి పోచించిన స్లాటర్ హౌస్ లే మీ పాలిట శాపంగా మారిందంటూ కాంగ్రెస్ స‌ర్కారుపై ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

నిచానికి దిగ‌జారుతున్నారు..

ప్రభుత్వ బాగోతం గురించి గత 6 నెలలుగా ఈ విషయాన్ని చర్చిస్తున్నార‌ని.. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వదిలేసి నిచానికి దిగ‌జారుతున్నార‌న్నారు. తెలంగాణ సీఎంగా ఒకరి దగ్గరకు వెళ్లి పరువు తీసి కాళ్లు మొక్కినప్పుడే ఈ రెండు కథనాలు వ‌చ్చాయ‌న్నారు. పాత కాంగ్రెస్ నాయకులైన ఆరోపణలు వస్తున్నాయ‌ని.. శ్రీధర్ బాబు, పొన్నం, కోమటి రెడ్డిపైనే ఆరోపణలు వ‌స్తున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ బాగోతం ఖమ్మం సభలో చాలా స్పష్టంగా అర్ధమవుతుంద‌ని, నేడు ఖమ్మం సభలో తెలుగుదేశం జెండాలు కనిపించినప్పుడే అర్థ‌మైంద‌న్నారు. ఆనాడు చంద్ర బాబు నాయుడు కూడా ఇలానే మాట్లాడిండ‌ని, అలా మాట్లాడిన బాబును పాతాళలోకానికి ప్రజలు పాతరేశార‌న్నారు. చంద్ర బాబు నాయుడు వైఖరినీ రాజకీయంగా కేసీఆర్ ఎదుర్కొన్నారు త‌ప్పా.. వ్యక్త గత ఆరోపణలు చెయ్యలేద‌న్నారు. కేసీఆర్ కాలి గోటికి రేవంత్ రెడ్డి సరిపోడని, కేసీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి గడ్డి పోసతో సమాన‌మ‌న్నారు. తొందరలోనే అధికార కోట కూలుతుంద‌ని.. చంద్రబాబు నాయుడుకు ఏ గతి అయితే పట్టిందో రేవంత్ రెడ్డికి అదే గతి ప‌డుతుంద‌న్నారు.

రేవంత్‌రెడ్డిని పాత‌రేయ‌డం ఖాయం..

చంద్ర బాబు నాయుడును పారద్రోలార‌ని.. రేవంత్ రెడ్డినీ పాతర వెయ్యడం ఖాయ‌మ‌న్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొట్టండి చూద్దాం అంటూ స‌వాల్ విసిరారు. పోలీసు అధికారులు నీతులు చెప్పడం కాద‌ని.. సీఎం రేవంత్ వ్యాఖ్య‌ల‌పై డీజీపీ, ఖ‌మ్మం సీపీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వస్తుంటే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తే ఇంత వ‌ర‌కు చ‌ర్య‌లు లేవ‌న‌ని విమ‌ర్శించారు. మూటలు పట్టుకొని వెళ్లి దొంగలా దొరికి తెలుగుదేశం పార్టీని పరువు తీసింది రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేసే పార్టీ తెలుగుదేశం అని ఆనాడు వివరంగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చెప్పార‌ని, కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల‌ని సూచించారు. ఈరోజు రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ గురించి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచన చేయాల‌ని, కాంగ్రెస్ పార్టీనీ రేవంత్ రెడ్డి వీడుతాడు అని సీనియర్ కాంగ్రెస్ నాయకులే చర్చ చేస్తున్నార‌న్నారు.

ఆ ప‌త్రిక‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి..

కేసీఆర్ ఏనాడు పత్రికల మీద మాట్లాడలేద‌ని, రేవంత్ రెడ్డి గొంతు ఒక పత్రిక రోజు వినిపించేలా చేస్తుంద‌ని మండిప‌డ్డారు. ఓ ప‌త్రిక బీఆర్ఎస్‌పై ఎంత విషం క‌క్కినా ప‌ట్టించుకోలేద‌ని.. కేసీఆర్ క్ష‌మించార‌న్నారు. ఆ పత్రిక కార్యాలయంపై దాడి జరిగితే కేసీఆర్ ప‌రామ‌ర్శించార‌న్నారు. మ‌హిళా ఐఏఎస్ అధికారి ఆత్మ‌హ‌త్య య‌త్నం చేసింద‌ని ఆ ప‌త్రిక ఎలా రాస్తుంది?.. మ‌హిళ ఐఏఎస్ అధికారుల ప‌రువు తీసింది ఈ రోజు రాసిన ప‌త్రిక‌నేన‌న్నారు. వెంట‌నే ఆ ప‌త్రిక‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐఏఎస్‌ల సంఘం డిమాండ్ చేయాల‌న్నారు. డీజీపీ ఆ ప‌త్రిక‌పై వెంట‌నే కేసు న‌మోదు చేయాల‌న్నారు. బీఆర్ఎస్‌పై విషం చిమ్మిన వారిని కేసీఆర్ ఏనాడు ఏం అనలేద‌ని, రాష్ట్రం సాధించుకున్నామ‌ని, ఎవరి పైన ద్వేషాలు పెంచుకోవొద్దని కేసీఆర్ చెప్పే వార‌న్నారు. పత్రిక అధిపతిగా ఏమైనా రాయాల్సి వస్తే విశ్లేషణ చేసి రాయాల‌ని.. రేవంత్ రెడ్డినీ ఒక పత్రిక అధిపతి కాపాడలేడని, రేవంత్ రెడ్డి మోసాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, తగిన బుద్ధి చెప్తారని జ‌గ‌దీశ్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement