త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Civil Society Leaders | మూసీ అభివృద్ధి పేరుతో భయ‌పెట్ట‌డం త‌గ‌దు: పౌర సంఘాల నేత‌లు

Musi | మూసీ అభివృద్ధి (Musi Development) పేరుతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని పౌర‌ సంఘాల నాయ‌కులు (Civil society leaders) అన్నారు. స్థానిక ప్రజల‌తో కలిసి ఆదివారం వారు నిరసన (Protest) కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్రశాంతంగా, గౌరవంతో, భయం లేకుండా జీవించే హక్కు ఉందన్నారు.

S

Telangana | Published On Mar 22, 2026, 6.10 pm IST

Civil Society Leaders | మూసీ అభివృద్ధి పేరుతో భయ‌పెట్ట‌డం త‌గ‌దు: పౌర సంఘాల నేత‌లు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: మూసీ అభివృద్ధి (Musi Development) పేరుతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని పౌర‌ సంఘాల నాయ‌కులు (Civil Society Leaders) అన్నారు. స్థానిక ప్రజల‌తో కలిసి ఆదివారం వారు నిరసన (Protest) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సామాజిక కార్యకర్తలు సజయ, జీవన్ కుమార్ తదితరులు ప్రసంగించారు. పౌరుల ప్రాథమిక హక్కులను (Fundamental Rights) పరోక్షంగా ప్రభావితం చేస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్రశాంతంగా, గౌరవంతో, భయం లేకుండా జీవించే హక్కు ఉందన్నారు. కె శ్రీనివాస్, తులసీచందు, ఘంటా చక్రపాణి తదితరులు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

పౌర సంఘాల మ‌ద్ద‌తు..

సాయిరామ్ న‌గ‌ర్‌, గంధంగూడ‌, హైద‌ర్‌షాకోట్ వాసులు పాల్గొని నిర‌స‌న తెలిపారు. ఈ నిరసనకు మూసీ జన ఆందోళన్‌, హ్యూమన్ రైట్స్ ఫోరం, సేవ్ మూసీ ఉద్యమం, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ వంటి పలు పౌర, సామాజిక సంస్థల నేత‌లు పాల్గొని మద్దతు తెలిపారు.

మాజీ రక్షణ సిబ్బంది ఆవేదన..

నిరసనలో భాగంగా భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనలో సేవలందించిన మాజీ రక్షణ సిబ్బంది కూడా పాల్గొన్నారు. దేశ ర‌క్ష‌ణ‌కు జీవితాలను అంకితం చేశామ‌ని, ఇప్పుడు తమ ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్నామని ఆవేద‌న చెందారు. ఇది జాతీయత‌కు సంబంధించిన అంశమని వారు అభిప్రాయపడ్డారు.

పోస్టు కార్డుల‌తో చిన్నారుల నిర‌స‌న‌..

గాంధీ విగ్రహం పేరుతో తమ ఇళ్లను కూల్చొద్ద‌ని చిన్నారులు (Childrens) వినూత్న నిరసన చేపట్టారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు చెందిన పిల్లలు ఏకంగా 1000కి పైగా పోస్టు కార్డులు (Post cards) రాశారు. ‘మా ఇళ్లు కాపాడండి’ అంటూ రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేస్తూ పోస్టు కార్డులు రాసి ప్ర‌ద‌ర్శించారు. చిన్నారుల నిరసనతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement