Paadi Koushik Reddy | మా పోరాటంతోనే దానంపై వేటు పడింది
Paadi Koushik Reddy | రెండున్నరేళ్ల తమ పోరాటంతోనే దానం నాగేందర్‌పై వేటు పడిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. పార్టీ మారిన మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు.
- మిగతా ఎనిమిది మందిపై కూడా అనర్హత వేటు తప్పదు
- త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయ్
- ఖైరతాబాద్‌లో 22ఏ ప్రభావం ఉంటది
- ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డగా బీజేపోళ్లు చెప్పుకుంటున్నరు
- ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు
Paadi Koushik Reddy | త్రినేత్ర న్యూస్: రెండున్నరేళ్ల తమ పోరాటంతోనే దానం నాగేందర్‌పై వేటు పడిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. పార్టీ మారిన మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. త్వరలోనే మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డగా బీజేపోళ్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇక ఖైరతాబాద్‌లో 22ఏ ప్రభావం ఉంటుందని.. నిరుద్యోగులు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తారని వ్యాఖ్యానించారు. గురువారం దానం కేసుపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆ 8 మందిపై బీజేపీ ఎందుకు కొట్లాడలే?
దానం నాగేందర్ విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు అద్భుతం. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కోసం 2024, మార్చి 24 నుంచి బీఆర్ఎస్ లీగల్ సెల్ పోరాడుతోంది. పిటిషన్ వేసిన రోజునే దానం నాగేందర్ పై వేటు పడుతుందని చెప్పాం. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి. చిల్లరగాళ్ళు, బ్రోకర్ గాళ్ళు తీర్పు తర్వాత చేసిన వ్యాఖ్యలను కోర్టు సీరియస్ గా తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు మందికి పుట్టిన బిడ్డలు తమ బిడ్డలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మిగతా ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ ఎందుకు పోరాడలేదు.
2024, మార్చి 14న దానం నాగేందర్ కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారు. 2024, మార్చి 18న స్పీకర్ కు ఫిర్యాదు చేశాం. 2024, మార్చి 21న దానం నాగేందర్‌ను కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించింది. 2024, ఏప్రిల్ 10న హైకోర్టుకు వెళ్ళాం. జూలై నుంచి మ్యాటర్ హియరింగ్ మొదలైంది. జనవరిలో నేను, మా కేటీఆర్ మళ్లీ కోర్టుకెళ్ళాం. 2025, జూలైలో స్పీకర్ డెసిషన్ తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇంట్లో ఉంటారా? జైల్లో ఉంటారా అని కూడా స్పీకర్‌కు వార్నింగ్ ఇచ్చింది. 2026, మార్చి 11న స్పీకర్ దానంకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశాం.
2026, సెప్టెంబర్ 18న హైకోర్టు దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే రోజు కేవియట్ వేశాం. ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్నే సమర్ధించింది. రెండున్నరేళ్ల మా పోరాటం తర్వాత దానంపై వేటు పడింది. పోరాటం చేసింది బీఆర్ఎస్సా? బీజేపీయా? సిగ్గు లేకుండా ఇపుడు తమ ఘనత అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.
ఓడిపోతాననే భయంతోనే సుప్రీంకు వెళ్లారు..
హైకోర్టు తీర్పు తర్వాత నాగేందర్ సుప్రీంకు పోనని చెప్పి మరుసటి రోజే మాట మార్చారు. కాంగ్రెస్ ఖైరతాబాద్ లో ఓడిపోతుందని తెలిసే సుప్రీంకోర్టుకు వెళ్లారు. రేవంత్‌కు ఎలాగు సిగ్గు శరం లేదు.. రాహుల్‌కు లేదా? రాహుల్‌కు కూడా ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదే. పార్టీ మారిన మిగతా ఎనిమిది మందిపై కూడా వేటు తప్పదు. త్వరలోనే ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఖైరతాబాద్‌లో 22ఏ ప్రభావం ఉంటుంది.
నిమజ్జనాలకు నీళ్లు కూడా ఇస్తలేరు..
నిరుద్యోగులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇక జీవితం లో వార్డు మెంబర్లుగా కూడా గెలవరు. గణేష్ విగ్రహాల నిమజ్జననానికి కనీసం నీళ్ల వసతి కూడా ఇవ్వని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మా హుజురాబాద్‌లో నిమజ్జనం కోసం నీళ్లు ఇవ్వాలని మంత్రి నుంచి సెక్రటరీ దాకా కోరాను. అయినా స్పందన లేదు. గణేష్ విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి నిమజ్జనం చేయడం బాధాకరం. కాంగ్రెస్‌కు ఇక ఎందుకు ఓట్లేయాలి? రక్తం మరుగుతోంది.
సజ్జనార్ తాట తీస్తాం..
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన నోరు అదుపులో పెట్టుకోవాలి. నిమజ్జనాల సందర్భంగా కేసీఆర్ పాటలు పెట్టడంపై నిషేధాలు విధించడానికి సజ్జనార్ ఎవరు? సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా? బ్రేక్ ఎప్పుడు చేయాలి.. లంచ్ ఎప్పుడు చేయాలి అని కూడా సజ్జనార్ చెబుతారా? మేం అధికారంలోకి రావడం ఖాయం. సజ్జనార్‌ను ఎక్కడున్నా వదిలిపెట్టం. సజ్జనార్ తాట తీస్తాం అని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Danam Nagender | ఖైరతాబాద్‌లో పోటీపై సీఎం రేవంత్ స్పష్టత ఇస్తారు : దానం నాగేందర్
సెప్టెంబర్ 24, 2026

Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు
సెప్టెంబర్ 24, 2026

BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా… పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Sabarimala Crown Row | శబరిమల ఆలయంలో బంగారు కిరీటం మాయం..?
- ●Ranbir Kapoor | రెట్రో లుక్‌లో రణభీర్‌కపూర్ - లవ్ అండ్ వార్ ప్రమోషన్స్ షురూ
- ●Adani Group | పశ్చిమ బెంగాల్‌పై అదానీ మెగా ప్లాన్.. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..
- ●Chiranjeevi | దళపతి విజయ్ కొడుకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ - చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్
- ●Danam Nagender | ఖైరతాబాద్‌లో పోటీపై సీఎం రేవంత్ స్పష్టత ఇస్తారు : దానం నాగేందర్
- ●Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?

Sabarimala Crown Row | శబరిమల ఆలయంలో బంగారు కిరీటం మాయం..?

Ranbir Kapoor | రెట్రో లుక్‌లో రణభీర్‌కపూర్ - లవ్ అండ్ వార్ ప్రమోషన్స్ షురూ

Adani Group | పశ్చిమ బెంగాల్‌పై అదానీ మెగా ప్లాన్.. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..

Chiranjeevi | దళపతి విజయ్ కొడుకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ - చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్



