త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | ఈడీ కేసులో పొంగులేటిని కాపాడుతుందెవరో చెప్పాలి

KP Vivekananda | ఈడీ (ED) కేసులో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డిని కాపాడుతుందెవ‌రో చెప్పాల‌ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Sep 28, 2026, 3.06 pm IST

KP Vivekananda | ఈడీ కేసులో పొంగులేటిని కాపాడుతుందెవరో చెప్పాలి
Advertisement

 

  • ఈడీ స‌రైన స‌మాధానం ఇవ్వ‌కుంటే ఢిల్లీలో కొట్లాడుతం
  • అదానిని కలవంగనే ఈడీ కేసు మాఫ్ అయిపోయిందా?
  • ఈడీని మేనేజ్ చేసిన కేడీనీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు
  • కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హెచ్చ‌రిక

KP Vivekananda | త్రినేత్ర న్యూస్: ఈడీ (ED) కేసులో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డిని కాపాడుతుందెవ‌రో చెప్పాల‌ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. ఆయ‌న‌ ఆస్తులపై జ‌రిగిన‌ సోదాల్లో ఈడీ నుంచి స‌రైన స‌మాధానం రాక‌పోతే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు పూనుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఐటీసీ కోహినూర్ హోటల్లో అదానిని క‌ల‌వంగ‌నే ఈడీ కేసు మాఫ్ అయిపోయిందా అని విమ‌ర్శించారు. ఈడీనీ మేనేజ్ చేసిన కేడీని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదన్నారు. ఈమేర‌కు సోమ‌వారం ఈడీ కార్యాల‌యం ఎదుట ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీలో కొట్లాట‌.. గ‌ల్లీలో దోస్తానా

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈడీ కేసు ఏమైందని ప్రశ్నించడానికి వచ్చాం. ఈడీ రైట్స్ జరిగి రెండు సంవత్సరాలు పూర్తయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై 16 చోట్ల ఈడీ రైడ్స్‌ జరిగాయి. పొంగులేటి మీద జరిగిన ఈడీ కేసులు, ఐటీ కేసుల మీద పురోగతి లేదు. ఐటీసీ కోహినూర్ హోటల్లో అదానిని కలవంగనే మాఫ్ అయిపోయిందా? కాంగ్రెస్ ఢిల్లీలో బీజేపీతో కొట్లాడుతుంది. హైదరాబాద్ గల్లీలో దోస్తానా చేస్తూ ఉంటారు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాపాడుతుంది ఎవరో చెప్పాలి. పొంగులేటి ఈడీ రైట్స్ పై ఇంతవరకు సమాచారం కూడా చెప్పడం లేదు. పొంగులేటి కుమారుడిని చెన్నై ఎయిర్ పోర్ట్ లో కోట్ల రూపాయల వాచ్‌లు పట్టుకున్న సంగతి చూశాం. వట్టినాగులపల్లిలో రైతు దగ్గరకు వెళ్లి భూమి లాక్కోవడానికి పోయిన విషయంలో FIR బుక్ అయింది.. అది కూడా పురోగతి లేదు. ఈడీని ఒక్కటే కోరాం.. పొంగులేటి కేసులపై స్పష్టత ఇవ్వమన్నాం. దేశంలో ఎక్కడైనా ఈడీ రైడ్స్ జ‌రిగితే ఎంత క్యాష్, ఆస్తులు పట్టుకున్నారు. పొంగులేటి బీజేపీతో కలిసి అవగాహన చేసుకున్నాడు. ఈడీ చర్యలు తీసుకోలేదని అర్థం అవుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement