Sabitha Indra Reddy | వస్తున్నామని చెప్పి వచ్చినా సీఐ లేరిక్కడ
Sabitha Indra Reddy | తమను అడ్డుకోవాలని ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని.. కమాండ్ కంట్రోల్‌లో కంప్లయింట్ ఇచ్చినా ఇంతవరకూ సమాధానం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాపోయారు. సైఫాబాద్ సీఐకి వస్తున్నామని చెప్పి తాము అక్కడికి వెళ్లేసరికి సీఐ లేరన్నారు.
- ఇప్పటికైనా మా కంప్లయింట్ తీసుకుని కేసు నమోదు చేయాలి
- మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన
Sabitha Indra Reddy | త్రినేత్ర.న్యూస్: తమను అడ్డుకోవాలని ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని.. కమాండ్ కంట్రోల్‌లో కంప్లయింట్ ఇచ్చినా ఇంతవరకూ సమాధానం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాపోయారు. సైఫాబాద్ సీఐకి వస్తున్నామని చెప్పి తాము అక్కడికి వెళ్లేసరికి సీఐ లేరన్నారు. ఇప్పటికైనా తమ కంప్లయింట్ తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు ద్రౌపదికి జరిగిన అవమానమే సునీతారెడ్డికి, తనకు జరిగిందని పేర్కొన్నారు. గురువారం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఆడ పోలీసుల స్థానంలో మగ పోలీసులొచ్చారు..
అసెంబ్లీకి బీజేపీ వాళ్లు ప్లకార్డులు పట్టుకుని వస్తే లోనికి అనుమతించారు. నల్ల షర్టులు వేసుకువచ్చినందుకు మా ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారు? మమ్మల్ని అడ్డుకునేందుకు 500 మంది పోలీసులను పెట్టారు. మేం రాగానే అప్పటివరకు ఉన్న ఆడపోలీసుల స్థానంలో మగపోలీసులు వచ్చారు. మేమేదో రౌడీలన్నట్లు రోడ్డుపైనే అడ్డుకుని అమానుషంగా ప్రవర్తించారు. నా గొంతు పట్టుకున్నారు, సునీతారెడ్డి చీర లాగారు. ఆనాడు ద్రౌపదికి జరిగిన అవమానమే మాకు జరిగింది.
సీఎం ఇప్పటికీ స్పందించలే..
మా పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును సీఎం ఇంతవరకూ ప్రశ్నించలేదు. ఆడ సభ్యుల ముందు మగ పోలీసులను ఎందుకు పెట్టారు? మగ సభ్యుల వద్దకు ఆడ పోలీసులను పంపినప్పుడే మీ కుట్ర అర్థమైంది. మహిళా పోలీసులు తమకు ఎక్కడ తగులుతారోనని జాగ్రత్తగా వ్యవహరించారు. మమ్మల్ని అడ్డుకోవాలని ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలి. కమాండ్ కంట్రోల్‌లో కంప్లయింట్ ఇచ్చినా ఇంతవరకూ సమాధానం లేదు. మేం కంప్లయింట్ ఇచ్చినందుకు మాపైనే ఉల్టా కేసు పెట్టారు. 14 మందిపై అక్రమ కేసు నమోదు చేశారు.
స్పీకర్‌ను తానేమీ అనలేదని మా సభ్యుడు చెప్పినా పట్టించుకోలేదు. దళిత స్పీకర్ అంటూ పలుమార్లు కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించారు. మాకే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడిది? సీఐకి మేం వస్తున్నామని చెప్పి పోలీస్‌స్టేషన్‌కు వస్తే ఇక్కడ లేరు. ఇప్పటికైనా మా కంప్లయింట్ తీసుకుని కేసు నమోదు చేయాలి. మాపట్ల అమానుషంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కొట్టడమంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలిపినందుకు కేసీఆర్ చావును కోరుకుంటారా? సీఎం హుందాగా వ్యవహరించాలి. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి. శాంతిభద్రతలను కాపాడాల్సిన సీఎం విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారు అని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
- ●Dasoju Sravan | రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలి..
- ●Indias nuclear arsenal | భారత్ వద్ద 190 అణు వార్‌హెడ్స్
- ●Sunil Kanugolu | కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు కంటిన్యూ.. దళపతి విజయ్ స్ట్రాటజిస్ట్ ఎంట్రీపై క్లారిటీ
- ●Apple | వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. పాత ఐఫోన్ మోడల్స్ ధరలు భారీగా పెంపు..
- ●Realtor Ram Reddy | ఫామ్ హౌజ్‌లో ఉరేసుకున్న ప్రముఖ రియల్టర్ రామ్ రెడ్డి
- ●Anaswara Rajan | టాలీవుడ్లో అనస్వర రాజన్ జోరు.. మూడు సినిమాలను లైన్లో పెట్టిన మలయాళ బ్యూటీ

Dasoju Sravan | రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలి..

Indias nuclear arsenal | భారత్ వద్ద 190 అణు వార్‌హెడ్స్

Sunil Kanugolu | కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు కంటిన్యూ.. దళపతి విజయ్ స్ట్రాటజిస్ట్ ఎంట్రీపై క్లారిటీ

Apple | వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. పాత ఐఫోన్ మోడల్స్ ధరలు భారీగా పెంపు..




