Rajireddy | కేసీఆర్ పోరుతోనే సత్తుపల్లి, కోయగూడెం బాయిలను ఆపుకున్నాం: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చైర్మన్ రాజిరెడ్డి
Rajireddy | సింగరేణిలో కొత్త గనులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. కేసీఆర్ పోరాటంతోనే సత్తుపల్లి, కోయగూడెం బాయిలను ఆపుకున్నామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు. మెడికల్ బోర్డ్ నిర్వహణలో జరగుతున్న అసాధారణ జాప్యంపై మండిపడ్డారు.
- కాంగ్రెస్ హయాంలో 54 వేల కోట్ల బకాయిలు అయ్యాయి
- 14 నెలలుగా మెడికల్ బోర్డు లేదు
- మారుపేర్ల విషయంలోనూ జాప్యం జరిగింది
- తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజిరెడ్డి
Rajireddy | త్రినేత్ర.న్యూస్: సింగరేణిలో కొత్త గనులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. కేసీఆర్ పోరాటంతోనే సత్తుపల్లి, కోయగూడెం బాయిలను ఆపుకున్నామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ బోర్డ్ నిర్వహణలో జరగుతున్న అసాధారణ జాప్యంపై మండిపడ్డారు. 54 వేల కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు.
32 మందినే పిలిచారు...
మెడికల్ బోర్డ్ నిర్వహణలో అసాధారణ జాప్యం జరగుతోంది. గత 14 నెలలుగా మెడికల్ బోర్డు లేదు. పెట్టిన రెండు బోర్డులు గతంలోనే ఉన్నవి. రెండోది అడ్వయిజరీ మెడికల్ బోర్డు. మొన్న 23వ తేదీన సింగరేణి చరిత్రలో ఒకేసారి మెడికల్ బోర్డు నిర్వహించారు. ఇప్పటివరకు రిజల్ట్స్ పెట్టలేదు. 32 మందినే పిలిచారు. అదికూడా గతంలో మెడికల్ బోర్డుకు పోయినవాళ్లే. బాయిల మీదికే కార్మికులకు సమాచారం ఇస్తమని చెప్పే అంశం ఆందోళనకరమే అని ఆయన పేర్కొన్నారు.
200 మందికి ఉద్యోగాలు లేవు..
మారుపేర్లకు సంబంధించి విజిలెన్స్ పేరిట జాప్యం జరిగింది. దాదాపు యాక్టివ్‌గా ఉన్న 200 మందికి ఉద్యోగాలు లేవు. అసలు, వడ్డీ కలుపుకొని 54 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బకాయిలు రూ. 20 వేల కోట్లే ఉండే. ఈరోజు అది రూ.54 వేల కోట్లకు చేరింది. సింగరేణి ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి లేదు అని రాజిరెడ్డి వాపోయారు. ఎంఎండీఆర్ యాక్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం నిర్వహించిన వేలాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు. దీంతో సత్తుపల్లి, కోయగూడెం బాయిలను ఆపుకున్నాం. ఇప్పటివరకు కూడా దానిపై నిర్ణయం లేదు. పర్యావరణ అనుమతులు రాకపోవడం వల్ల కొత్తబాయిలు ఆగిపోయినయి తప్పా కాంగ్రెస్ ఏం చేయలేదు అని విమర్శించారు.
ఎన్నికలు నిర్వహించాలి..
ప్రతి కార్మికునికి 250 గజాల స్థలం ఇస్తామన్నారు. 1-7-2027 నుంచి కొత్త వేజ్‌బోర్డ్ వస్తుంది. దానికి సంబంధించి కమిటీ వేయాలి. లేదంటే కార్మికులు అనేక అలవెన్సులు కోల్పోతారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలి. వచ్చే సెప్టెంబర్‌తో గడువు పూర్తి అవుతుంది. ఎన్నికలు కూడా నిర్వహించాలి. ఒకవేళ నిర్వహించకుంటే కోర్టుకు వెళ్లయినా సరే ఎన్నికలు జరిగేలా చూడాలి అని రాజిరెడ్డి పిలుపునిచ్చారు.
కేసీఆర్, కేటీఆర్ సూచనల మేరకు అందరం నడుచుకోవాలి. కొన్ని నియోజకవర్గాల్లో మనవాళ్లు వేర్వేరు వ్యక్తులతో తిరుగుతున్నారు. అలాంటిది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. పార్టీ చెప్పిన నిబంధనలు పాటించాలి. ఎవరు వాటిని దాటినా క్రమశిక్షణ చర్యలు తప్పవు అని రాజిరెడ్డి హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



