Niranjan Reddy | కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పిచ్చికి పరాకాష్ట: నిరంజన్‌రెడ్డి
Niranjan Reddy | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు సిట్ (SIT) నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ (Congress) పిచ్చికి పరాకాష్ట అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న పాపాలకు మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు.
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు సిట్ (SIT) నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ (Congress) పిచ్చికి పరాకాష్ట అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పులు ప్రజలు లెక్కిస్తున్నారని అన్నారు. ఆ పార్టీ చేస్తున్న పాపాలకు మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. సాక్షులుగా విచారిస్తున్నాం అంటూ దోషులుగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో సిట్ తీరు, కాంగ్రెస్, ఒక వర్గం మీడియా పాత్ర అనుమానాస్పదంగా ఉందని అన్నారు. విచారణ పేరుతో రెండేళ్లుగా బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని విమర్శించారు. కొండను తవ్వాం అని చెప్పుకుంటూ ఎలుకను కూడా పట్టలేదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు, ప్రచారానికి పొంతన లేకుండా ఉందని అన్నారు.
రెండేళ్లుగా అభివృద్ధి లేదని, సంక్షేమం అసలే లేదని, కానీ సిట్‌ల విచారణ పేరుతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి వస్తున్నా రైతుభరోసా ఊసెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తులం బంగారం ఇవ్వమని చేతులు ఎత్తేశారని, పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత కళ్యాణలక్ష్మి పైసలు వస్తున్నాయని వాపోయారు. యూరియా దొరకక రైతులు అల్లాడుతున్నారని, చంటిబిడ్డలతో యూరియా కోసం లైన్లో నిలబడుతున్నారని వివరించారు. ఫించన్ల పెంపు మాటెత్తడం లేదని, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు మాయం చేశారని చెప్పారు. పాలనను గాలికి వదిలి రేవంత్ రెడ్డి విదేశాల్లో విహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఆరు గ్యారంటీలని ఆశ చూపి, ఉన్న పథకాలను గంగలో కలిపారని మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



