BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
BRS Constituency Incharges | బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గులాబీ అధినేత ఇంచార్జీలను ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల ఇంచార్జీలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణుతో కలిపి తెలంగాణ భవన్ లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు.
- తెలంగాణ భవన్‌లో డిజిటల్ శిక్షణ
- ప్రతి ఒక్కరికీ భోజన వసతి
- త్వరలోనే అందుబాటులోకి యాప్
KCR | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గులాబీ అధినేత ఇంచార్జీలను ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల ఇంచార్జీలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణుతో కలిపి తెలంగాణ భవన్ లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన మేరకు సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. త్వరలో అందుబాటులోకి రానున్నది.
తెలంగాణ భవన్ లో శిక్షణ అనంతరం, వీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జీల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా పార్టీ కార్యలయాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బూత్ ల సంఖ్యను బట్టి బూత్ కు ఇద్దరు చొప్పున నిర్ణయించిన తేదీ నుంచి వారం రోజుల పాటు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.
శిక్షణకు హాజరైన వారికి భోజన వసతులు కల్పించనున్నారు.
ఈ ప్రక్రియలో రాష్ట్ర కమిటీ నుంచి నియమించిన ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జుల ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారాలను ఆయా జిల్లాల వారీగా నిర్వహించనున్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు. ప్రకటించే రోజున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ తో సహా పార్టీ ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొంటారు. తద్వారా పండుగ వాతావరణంలో, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ, నమోదు ప్రక్రియ మొదలవుతుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తారు. నిర్ణీత తేదీలలో కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ శిక్షణాశిబిరాలు నిర్వహిస్తారు.
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ఇంచార్జీలు వీరే (ఉమ్మడి జిల్లాల వారీగా)..
ఆదిలాబాద్ జిల్లా
సిర్పూర్ నియోజకవర్గానికి శ్రీ పాటిమీది జగన్ మోహన్ రావు, చెన్నూర్ (ఎస్సీ)- శ్రీ తిప్పని లింగన్న, బెల్లంపల్లి (ఎస్సీ)- శ్రీ మిర్యాల రాజిరెడ్డి, మంచిర్యాల- శ్రీ కౌశిక హరి, ఆసిఫాబాద్ (ఎస్టీ)- శ్రీ తొంగల సత్యనారాయణ, ఖానాపూర్ (ఎస్టీ)- శ్రీమతి సుమిత్ర ఆనంద్ తనోబా ఆదిలాబాద్ - రాథోడ్ జనార్దన్, బోథ్ (ఎస్టీ) - శ్రీ ఎ. శ్రీకాంత్ రెడ్డి, నిర్మల్ - శ్రీ మూల రాజిరెడ్డి, ముధోల్ - శ్రీ రఘువీర్ సింగ్‌ను బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.
నిజామాబాద్ జిల్లా
ఆర్మూర్‌కు శ్రీ కాంతారెడ్డి తిరుపతి రెడ్డి, బోధన్‌కు శ్రీ డి. విఠల్ రావు, జుక్కల్ (ఎస్సీ)కు శ్రీ మాటం భిక్షపతి, బాన్సువాడకు శ్రీ తోట ఆగయ్య, ఎల్లారెడ్డికి శ్రీ దఫేదార్ రాజు, కామారెడ్డికి మాజీ ఎమ్మెల్సీ శ్రీ సేరి సుభాష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్‌కు శ్రీ రవీందర్ సింగ్, నిజామాబాద్ రూరల్‌కు శ్రీ గిర్ధావర్ గంగాధర్, బాల్కొండకు శ్రీమతి దావా వసంత.
కరీంనగర్ జిల్లా
కోరుట్లకు శ్రీ లోక బాపు రెడ్డి, జగిత్యాలకు మాజీ ఎమ్మెల్యే శ్రీ కె. విద్యాసాగర్ రావు, ధర్మపురి (ఎస్సీ)కు శ్రీమతి మూల విజయ రెడ్డి, రామగుండానికి శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి, మంథనికి శ్రీ వీర్ల వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లికి ఎమ్మెల్సీ శ్రీ పి. వెంకట్రామిరెడ్డి, కరీంనగర్‌కు శ్రీ కొండూరి రవీందర్ రావు, చొప్పదండి (ఎస్సీ)కు శ్రీ పన్యాల భూపతి రెడ్డి, వేములవాడకు శ్రీ గుడూరి ప్రవీణ్, సిరిసిల్లకు శ్రీమతి తుల ఉమ, మానకొండూర్ (ఎస్సీ)కు శ్రీ పెరాల రవీందర్ రావు, హుజూరాబాద్‌కు డాక్టర్ చిరుమిల్ల రాకేష్, హుస్నాబాద్‌కు జివి రామకృష్ణారావు.
మెదక్ జిల్లా
సిద్దిపేటకు ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి, మెదక్‌కు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, నారాయణఖేడ్‌కు శ్రీ జైపాల్ రెడ్డి, అందోల్ (ఎస్సీ)కు శ్రీ పట్నం మాణిక్యం, నర్సాపూర్‌కు శ్రీ నరహరి రెడ్డి, జహీరాబాద్ (ఎస్సీ)కు శ్రీ దేవీ ప్రసాద్, సంగారెడ్డికి శ్రీ చంద్ర గౌడ్, పటాన్‌చెరుకు శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్, దుబ్బాకకు శ్రీ కాసాల బుచ్చిరెడ్డి, గజ్వేల్‌కు శ్రీ రాధాకృష్ణ శర్మను సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించారు.
రంగారెడ్డి జిల్లా
మెడ్చల్‌కు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరికి శ్రీ నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్‌కు ఎమ్మెల్సీ శ్రీ కె. నవీన్ రావు, కూకట్‌పల్లికి శ్రీ గజ్జెల నాగేశ్, ఉప్పల్‌కు శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నానికి మాజీ ఎమ్మెల్సీ శ్రీ స్వామి గౌడ్, ఎల్బీనగర్‌కు శ్రీ నాగేశ్ ముదిరాజ్, మహేశ్వరానికి ఎమ్మెల్సీ శ్రీమతి వాణీదేవి, రాజేంద్రనగర్‌కు శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి, శేరిలింగంపల్లికి ఎమ్మెల్సీ శ్రీ శంభీపూర్ రాజు, చేవెళ్ల (ఎస్సీ)కు శ్రీ రాంబాబు యాదవ్, పరిగికి శ్రీ ఎంఎన్ శ్రీనివాస్, వికారాబాద్ (ఎస్సీ)కు శ్రీ గట్టు రాంచందర్ రావు,తాండూరుకు శ్రీ విప్లవ్ కుమార్.
హైదరాబాద్ జిల్లా
ముషీరాబాద్‌కు శ్రీ వెంకట్ రెడ్డి (అంబర్‌పేట్), అంబర్‌పేట్‌కు శ్రీ కోలేటి దామోదర్ గుప్తా, ఖైరతాబాద్‌కు ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్‌కు మాజీ ఎమ్మెల్యే శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, సనత్‌నగర్‌కు శ్రీ గోసుల శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్‌కు మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎండీ సలీం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ)కు శ్రీ మన్నె క్రిశాంక్, నాంపల్లికి శ్రీ షేక్ అబ్దుల్లా సోహైల్, కార్వాన్‌కు శ్రీ ఇనాయత్ అలీ బాఖ్రీ, గోషామహల్‌కు శ్రీ గౌండ్ల నాగేందర్ గౌడ్, చార్మినార్‌కు శ్రీ అలీ బిన్ ఇబ్రహీం మస్కతి, చాంద్రాయణగుట్టకు శ్రీమతి షాహీన్ అఫ్రోజ్, యాకుత్‌పురాకు శ్రీ అర్షద్ అలీ ఖాన్, బహదూర్‌పురాకు శ్రీ ఎస్.ఎ. ఖైసర్, మలక్‌పేట్‌కు శ్రీ మహమ్మద్ ఆజమ్ అలీ.
మహబూబ్‌నగర్ జిల్లా
కొడంగల్‌కు ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ రెడ్డి, నారాయణపేటకు శ్రీ రాజీవ్ సాగర్, మహబూబ్‌నగర్‌కు శ్రీ వాల్యా నాయక్, జడ్చర్లకు శ్రీమతి పాల్వాయి స్రవంతి, దేవరకద్రకు శ్రీ పల్లె రవికుమార్, మక్తల్‌కు శ్రీ దూదిమెట్ల బాలరాజు, వనపర్తికి శ్రీ మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్, గద్వాలకు శ్రీ ఆంజనేయ గౌడ్, అలంపూర్ (ఎస్సీ)కు ఎమ్మెల్సీ శ్రీ చల్లా వెంకట్రామిరెడ్డి, నాగర్‌కర్నూలుకు శ్రీ జహంగీర్, అచ్చంపేట (ఎస్సీ)కు శ్రీ శుభప్రద్ పటేల్ నూలి, కల్వకుర్తికి శ్రీమతి రాజిని సాయిచంద్, షాద్‌నగర్‌కు శ్రీ బైకాని శ్రీనివాస్ యాదవ్, కొల్లాపూర్‌కు శ్రీ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి.
నల్గొండ జిల్లా
దేవరకొండ (ఎస్టీ)కు శ్రీ చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నాగార్జునసాగర్‌కు మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడిద భిక్షమయ్య గౌడ్, మిర్యాలగూడకు మాజీ ఎంపీ శ్రీ బి. లింగయ్య యాదవ్, హుజూర్‌నగర్‌కు శ్రీ కంచర్ల కృష్ణారెడ్డి, కోదాడకు శ్రీ తిప్పన విజయసింహా రెడ్డి, సూర్యాపేటకు శ్రీ ఈస్లావత్ రాంచందర్ నాయక్, నల్గొండకు ఎమ్మెల్సీ శ్రీ ఎంసీ కోటి రెడ్డి, మునుగోడుకు శ్రీ వెంకట నారాయణ గౌడ్, భువనగిరికి శ్రీ క్యామ మల్లేష్, నకిరేకల్ (ఎస్సీ)కు శ్రీ గుజ్జా దీపిక యుగంధర్ రావు, తుంగతుర్తి (ఎస్సీ)కు శ్రీ ఏలగందుల వెంకటేశ్వర్, ఆలేరు కు శ్రీ బండా నరేందర్ రెడ్డి.
ఖమ్మం జిల్లా
పినపాక (ఎస్టీ)కు శ్రీ దిండిగల రాజేందర్, ఇల్లందు (ఎస్టీ)కు శ్రీ చాడ కిషన్ రెడ్డి, ఖమ్మంకు శ్రీ అనుగుల రాకేష్ రెడ్డి, పాలేరుకు ఎమ్మెల్సీ శ్రీ తాతా మధు, మధిర (ఎస్సీ)కు మాజీ ఎంపీ శ్రీ నామా నాగేశ్వరరావు, వైరా (ఎస్టీ)కు శ్రీ ఆర్‌జేసీ కృష్ణ, సత్తుపల్లి (ఎస్సీ)కు శ్రీ కురాకుల నాగభూషణం, కొత్తగూడెంకు ఎంపీ శ్రీ వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట (ఎస్టీ)కు శ్రీ ఉప్పల వెంకటరమణ, భద్రాచలం (ఎస్టీ)కు శ్రీ రావలపల్లి రామ్ ప్రసాద్.
వరంగల్ జిల్లా
జనగామకు శ్రీ బండా శ్రీనివాస్, ఘనపూర్ (ఎస్సీ)కు శ్రీ నాగుర్ల వెంకన్న, పాలకుర్తికి శ్రీ ఎం. సుధీర్ కుమార్, డోర్నకల్ (ఎస్టీ)కు మాజీ ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, మహబూబాబాద్ (ఎస్టీ)కు శ్రీ వై. సతీష్ రెడ్డి, నర్సంపేటకు మాజీ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పరకాలకు శ్రీ సమ్మారావు, వరంగల్ పశ్చిమకు శ్రీ కె. వాసుదేవ రెడ్డి, వరంగల్ తూర్పుకు శ్రీ మర్రి యాదవ రెడ్డి, వర్ధన్నపేట (ఎస్సీ)కు శ్రీ మసూద్, భూపాలపల్లికి శ్రీ రామస్వామి నాయక్, ములుగు (ఎస్టీ)కు శ్రీమతి గండ్ర జ్యోతిని బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



