త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | ఓవైసీ సోద‌రుల‌కు దేశ‌భ‌క్తి స‌ర్టిఫెకెట్లు ఇవ్వ‌డమంటే యావ‌త్ దేశాన్ని అవ‌మానించ‌డ‌మేన‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. పోలీసులను 15 నిమిషాలు పక్కన పెడితే సంగతి చూస్తామన్న వారికి, అసెంబ్లీలో వందేమాతరం పాడుతుంటే కనీసం గౌరవంగా లేచి నిలబడని ఎంఐఎం నాయకులకు రేవంత్ రెడ్డి దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తారా? అని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 4, 2026, 5.12 pm IST

Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచంద‌ర్‌రావు
Advertisement

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఓవైసీ సోద‌రుల‌కు దేశ‌భ‌క్తి స‌ర్టిఫెకెట్లు ఇవ్వ‌డమంటే యావ‌త్ దేశాన్ని అవ‌మానించ‌డ‌మేన‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. పోలీసులను 15 నిమిషాలు పక్కన పెడితే సంగతి చూస్తామన్న వారికి, అసెంబ్లీలో వందేమాతరం పాడుతుంటే కనీసం గౌరవంగా లేచి నిలబడని ఎంఐఎం నాయకులకు రేవంత్ రెడ్డి దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తారా? అని మండిప‌డ్డారు. ముందు మీ మిత్ర‌ప‌క్షాల చేత స‌భ‌లో నిండు మ‌న‌సుతో వందేమాత‌రం పాడించి అప్పుడు దేశ‌భ‌క్తి గురించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. ఈమేర‌కు శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ తీరుపై ఫైర‌య్యారు.

రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిని అడుగుతున్నా.. దేశభ‌క్తి అంటే ఏంది? మేం ఆవు మాంసం తింట‌ము, అది బాగా బాగుంటుందని ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ప‌బ్లిక్‌గా మాట్లాడడాన్ని మెచ్చుకొని మీరు దేశ‌భ‌క్తి అంటున్నారా? మీరు దేనికోసం దేశ‌భ‌క్తి అంటున్నారు వీళ్ల‌ను. ఇది దేశ‌భ‌క్తికి చిహ్న‌మా? దేశానికి సంబంధించిన గేయానికి, జాతీయ జెండాకు మ‌ర్యాద ఇవ్వ‌డం దేశ‌భ‌క్తి. అసెంబ్లీలో వందేమాతరం పాడుతుంటే ఏ ఒక్క ఎంఐఎం ఎమ్మెల్యే కూడా నిల‌బ‌డ‌లేదు. ఇది దేశ‌భ‌క్తా?

ఈ స‌ర్టిఫికేట్లు ఎప్ప‌టి నుంచి ఇస్తున్నారో రేవంత్‌రెడ్డిగారు. ఇంకా న‌యం రాహుల్‌గాంధీకి ఇయ్య‌లేదు. మీ పార్టీలో నిజంగా మీరు పూజ చేసుకోవాలంటే పూర్తిగా వందేమాతరం పాడండి. అదేరోజు మీరు కూడా దేశ‌భ‌క్తుల‌వుతారు. ఆ తర్వాతే దేశభక్తి గురించి మాట్లాడాలి అని రాంచంద‌ర్‌రావు సూచించారు. కాగా నిన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఓవైసీ సోదరులను సీఎం రేవంత్ పొగడటంపై ఆయ‌న అభ్యంతరం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement