త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Basavaraju Saraiah | ధైర్య‌ముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ

Basavaraju Saraiah | మంత్రి కొండా సురేఖ‌కు ధైర్య‌ముంటే త‌న‌పై ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల‌ని.. అందుకు తాను రెడీగా ఉన్నాన‌ని ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య ఓపెన్ ఛాలెంజ్ చేశారు. పైసా ఖ‌ర్సు వెట్ట‌కుండా బ‌రిలో నిల‌వాలని స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On Sep 4, 2026, 3.56 pm IST

Basavaraju Saraiah | ధైర్య‌ముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ

సంక్షిప్త సారాంశం

ర‌క్తం తాగింది మీరు. ప్ర‌జ‌ల రక్తం తాగింది మీరు నేన్ కాదు. ఊ అంటే ఆ అంటే బీసీ అంట‌వ్‌. అంటే నువ్ బీసీ, మీ బిడ్డ బీసీ, నీ మ‌న్మ‌రాలు బీసీ.. నీ కుటుంబ‌మే బీసీ.. ఇంకెవ్వ‌ళ్లేరా? ప‌ద‌వులు మీకిస్తేనే బీసీ.. ఇంకెవ్వ‌ళ్లేరా?

Advertisement
  • పైసా ఖ‌ర్సు వెట్ట‌కుండా బ‌రిలో ఉందాం
  • మంత్రి కొండా సురేఖ‌కు ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య ఓపెన్ ఛాలెంజ్‌

Basavaraju Saraiah | త్రినేత్ర‌.న్యూస్‌: మంత్రి కొండా సురేఖ‌కు ధైర్య‌ముంటే త‌న‌పై ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల‌ని.. అందుకు తాను రెడీగా ఉన్నాన‌ని ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య ఓపెన్ ఛాలెంజ్ చేశారు. పైసా ఖ‌ర్సు వెట్ట‌కుండా బ‌రిలో నిల‌వాలని స‌వాల్ విసిరారు. నీ కుటుంబ‌మే బీసీయా.. ఇంకెవ్వ‌ళ్లేరా అని ప్ర‌శ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఇంకోసారి ఏమ‌న్నా అంటే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. నిన్న బ‌ర్త‌ర‌ఫ్ సంద‌ర్భంగా కొండా సురేఖ ప‌రోక్షంగా త‌న‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై సార‌య్య‌ తాజాగా స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు.

నీ కుటుంబ‌మే బీసీయా.. ఇంకెవ్వ‌ళ్లేరా?

ర‌క్తం తాగింది మీరు. ప్ర‌జ‌ల రక్తం తాగింది మీరు నేన్ కాదు. ఊ అంటే ఆ అంటే బీసీ అంట‌వ్‌. అంటే నువ్ బీసీ, మీ బిడ్డ బీసీ, నీ మ‌న్మ‌రాలు బీసీ.. నీ కుటుంబ‌మే బీసీ.. ఇంకెవ్వ‌ళ్లేరా? ప‌ద‌వులు మీకిస్తేనే బీసీ.. ఇంకెవ్వ‌ళ్లేరా? ఎవ‌ర్నైనా స‌రే కాళ్లు వ‌ట్టుకున్నోళ్ల‌ను ఆశీర్వ‌దిస్తే మీది ఒక చేతు కిందుంట‌ది.. ఒక చేతు పైనుంట‌ది. అలాంటి క‌ల్చ‌ర్ మీది.

ధైర్యముంటే రాండి.. ఇద్ద‌రం క‌లిసి పోటీ చేద్దాం. నువ్ ఇండిపెండింట్‌, నేన్ ఇండిపెండింట్‌గా పోటీ చేద్దాం. నువ్ ఒక్క పైసా ఖ‌ర్సు వెట్ట‌కు, నేన్ గూడా ఒక్క పైసా ఖ‌ర్సు వెట్టా. రాబోయే రోజుల్లో వ‌రంగ‌ల్ తూర్పు నుంచి బ‌రిలోకి దిగ‌డం నా చేతుల్లో లేదు. వ్య‌క్తిగతంగా న‌న్ను అన్న‌రు గ‌నుక నేన్ ఇండిపెండింట్‌గా బ‌రిలో ఉండ‌డానికి రెడీ. రేవంత్‌రెడ్డిని ఇంకోసారి అంటే వ‌రంగ‌ల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వం గాని, జిల్లా ప్ర‌జ‌లు గాని ఎవ్వ‌రు విశ్వ‌సించరు. కాస్త ద‌య‌చేసి అన్ని విధాల ఆలోచించుకొని మాట్లాడు అని ఎమ్మెల్సీ సార‌య్య హిత‌వు ప‌లికారు.

ఇదిలా ఉండగా నిన్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను ఉద్దేశించి ‘నీ భార్య కూడా నీకు ఓటు వేయదు’ అంటూ కొండా సురేఖ చేసిన‌ పరోక్ష వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కొండా సురేఖపై బస్వరాజు సారయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కొండా సురేఖపై ఫిర్యాదు చేసింది నేనే అని సారయ్య అన్నారు. 250 మూగజీవాలను కాల్చింది ఎవరు అని ప్రశ్నించారు.

కాగా వరంగల్ జిల్లా రాజకీయాల్లో బస్వరాజు సారయ్య వర్సెస్ కొండా ఫ్యామిలీ మధ్య చాలా కాలంగా విభేదాలు నడుస్తున్న విష‌యం విదిత‌మే. ప్రస్తుతం సురేఖ బర్తరఫ్ పరిణామం ఒక‌వైపు, ఇరువర్గాల మధ్య బహిరంగ సవాళ్లు మ‌రోవైపు.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల‌ను ఏ మలుపు తిప్పుతాయోన‌ని రాజకీయ వర్గాల్లో తీవ్ర‌ ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement