SEBI | డెరివేటివ్స్ సెటిల్‌మెంట్ ధరలపై సెబీ కీలక సమీక్ష.. వారం రోజుల్లో మార్పులు..?
SEBI | భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) డెరివేటివ్ కాంట్రాక్టులకు సెటిల్‌మెంట్ ధరలను నిర్ణయించే విధానాన్ని సమీక్షించేందుకు సిద్ధమవుతోంది. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) ప్రవేశపెట్టిన తర్వాత మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో ఈ సమీక్ష చేపడుతున్నట్లు తెలుస్తోంది.
SEBI | భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) డెరివేటివ్ కాంట్రాక్టులకు సెటిల్‌మెంట్ ధరలను నిర్ణయించే విధానాన్ని సమీక్షించేందుకు సిద్ధమవుతోంది. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) ప్రవేశపెట్టిన తర్వాత మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో ఈ సమీక్ష చేపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రతిపాదిత మార్పులను సెబీ మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. సీఏఎస్ అమలులోకి వచ్చిన తర్వాత దాని ప్రారంభ అనుభవాన్ని అంచనా వేయడానికి సెబీ మార్కెట్ భాగస్వాములు, ఇతర వాటాదారులతో చర్చలు జరుపుతోంది. సోషల్ మీడియా, ఇతర మీడియా వేదికలతోపాటు పలు మార్గాల ద్వారా అభిప్రాయాలను స్వీకరించింది. అభిప్రాయ సేకరణలో ప్రధానంగా డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగిసే రోజున సెటిల్‌మెంట్ ధరలను ఎలా లెక్కించాలనే అంశంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ద్వారా నిర్ణయించే ముగింపు ధరను కొన్ని డెరివేటివ్ కాంట్రాక్టుల సెటిల్‌మెంట్ ధరను నిర్ణయించడానికి ప్రాతిపదికగా ఉపయోగిస్తున్నారు.
వెంటనే అమలు చేస్తారా..
అయితే ఈ విధానంపై మార్కెట్ భాగస్వాముల నుంచి అభ్యంతరాలు, సూచనలు వచ్చినట్లు సెబీ తెలిపింది. సీఏఎస్ అమలులోని ప్రారంభ దశను సమీక్షించిన అనంతరం, అందిన సూచనలను పరిగణనలోకి తీసుకుని డెరివేటివ్ సెటిల్‌మెంట్ ధరల లెక్కింపు విధానంలో మార్పులను ప్రతిపాదించే అవకాశం ఉందని నియంత్రణ సంస్థ వెల్లడించింది. ప్రతిపాదిత మార్పులను వెంటనే అమలు చేయబోమని సెబీ స్పష్టం చేసింది. కొత్త విధానాన్ని ముందుగా మార్కెట్ భాగస్వాములు, ఇతర వాటాదారులతో చర్చించనుంది. తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపాదిత విధానంపై మార్కెట్ వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇక క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అంటే వేలం సమయంలో సేకరించిన కొనుగోలు, విక్రయ ఆర్డర్ల ఆధారంగా సెక్యూరిటీల అధికారిక ముగింపు ధరను నిర్ణయించే విధానం. ఇది నగదు మార్కెట్‌కు మాత్రమే పరిమితం కాకుండా డెరివేటివ్ మార్కెట్‌పైనా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే షేర్లు, సూచీల ముగింపు ధరలు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగిసే సమయంలో ఉపయోగించే సెటిల్‌మెంట్ విలువను ప్రభావితం చేస్తుంది.
కీలకం కానున్న సెటిల్‌మెంట్ ధర..
సీఏఎస్ ద్వారా నిర్ణయించే ముగింపు ధరకు, డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు సెటిల్‌మెంట్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని మరింత పరిశీలించాల్సిన అవసరం ఉందని మార్కెట్ నుంచి వచ్చిన అభిప్రాయాలు సూచిస్తున్నాయి. సెబీ త్వరలో ప్రతిపాదిత మార్పులను వెల్లడించే అవకాశం ఉంది. సీఏఎస్ ప్రారంభ అమలులో వెలుగులోకి వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు మార్కెట్ భాగస్వాముల సూచనలను పరిగణనలోకి తీసుకోవడంపై నియంత్రణ సంస్థ దృష్టి పెట్టనుంది. అయితే సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు తుది సెటిల్‌మెంట్ ధరల విధానం ఖరారు కాదు. డెరివేటివ్స్ ట్రేడర్లు, ఇతర మార్కెట్ భాగస్వాములకు ఈ మార్పులు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కాంట్రాక్టుల గడువు ముగిసే సమయంలో వాటి తుది విలువను నిర్ణయించడంలో సెటిల్‌మెంట్ ధర నేరుగా ప్రభావం చూపుతుంది.
తాజావార్తలు
- ●BRS Party | అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 6న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
- ●Basavaraju Saraiah | ధైర్యముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ
- ●Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలకు స్వల్ప లాభాలు..
- ●Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
- ●గాంధీ భవన్లో ‘పాత గురుతులు’.. పాలనలో ‘వలస వెలుగులు’: రేవంత్ మార్క్ కాంగ్రెస్‌లో అసలు కేడర్ ప్రశ్న!
- ●Anasuya | వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్ - అనసూయ కృష్ణాష్టమి డ్యాన్స్ వీడియో వైరల్

BRS Party | అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 6న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

Basavaraju Saraiah | ధైర్యముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ

Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలకు స్వల్ప లాభాలు..

Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య






