RS Praveen Kumar | మీ ప్రజా ప్రభుత్వంలో ప్రశ్నలు అడగడం నేరమా సీతక్క?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | మీ ప్రజా ప్రభుత్వంలో ప్రశ్నలు అడగడం నేరమా అంటూ మంత్రి సీతక్కను (Minister Seethakka) బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) నిలదీశారు. తాము ఫోన్ల గురించి మాట్లాడితే మీరు చెప్పుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్: మీ ప్రజా ప్రభుత్వంలో ప్రశ్నలు అడగడం నేరమా అంటూ మంత్రి సీతక్కను (Minister Seethakka) బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) నిలదీశారు. తాము ఫోన్ల గురించి మాట్లాడితే మీరు చెప్పుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము చెబుతున్నది తప్పని మీరు అనుకుంటే ఆధారాలతో సహా, నోట్ ఫైల్స్ అన్నీ ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. మేడారంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మీరు ప్రజా సేవలో చాలా బిజీగా ఉంటే మీ అధికారులను మీడియాతో మాట్లాడమని చెప్పాలన్నారు. అంతే కాని చెప్పుల భాష మాట్లాడొద్దని హితవు పలికారు. అది సభ్యత కాదన్నారు.
`నిజానికి తమరు చెప్పులతో రోజూ కొట్టవలసిన గజదొంగలు తమరి ప్రజా ప్రభుత్వం లోనే చాలా మంది ఉన్నారు. వారి భాగోతాలను ఆధారాలతో సహా మీడియా ముందు ఇప్పటికే పెట్టాం. దయచేసి ఆ పని చేసి వీరవనితలు సమ్మక్క, సారలమ్మల నిజమైన వారసురాలినని నిరూపించండి.` అని మంత్రి సీతక్కకు హితవు పలికారు.
ప్రభుత్వం అంగన్‌వాడీలకు పంపిణీ చేసిన సెల్‌ఫోన్ల టెండర్లలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆధారాలతో సహా బయటపెట్టారు. 38,310 మొబైల్‌ఫోన్ల కోసం సెల్‌కాన్ కంపెనీకి మంత్రి సీతక్క రూ. 54 కోట్లు కట్టబెట్టారని చెప్పారు. దీనిపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తే చెప్పు తెగుతుందని హెచ్చరించారు.
మేం ఫోన్ల గురించి మాట్లాడితే మీరు చెప్పుల గురించి మాట్లాడుతున్నారు.
మీ ప్రజా ప్రభుత్వంలో ప్రశ్నలు అడగడం నేరమా, @seethakkaMLA గారు?మేం చెబుతున్నది తప్పని మీరు అనుకుంటే దయచేసి ఆధారాలతో సహా, నోట్ ఫైల్స్ అన్నీ ప్రజల ముందు పెట్టండి.
మేడారంలో బహిరంగ చర్చకు రాండి. మీరు ప్రజా సేవలో… https://t.co/RmbExvEuW4— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 13, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

Maha News | మహా న్యూస్‌పై ఉదయ్ కుమార్ ఫిర్యాదు.. క్రిమినల్ చర్యలకు డిమాండ్
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



