త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నీటి పారుద‌ల‌పై మంత్రి ఉత్త‌మ్ స‌మీక్ష‌

Uttam Kumar Reddy | ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ప్రత్యేక సమీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహ‌రి హాజ‌ర‌య్యారు.

S

Telangana | Published On Jun 11, 2026, 4.41 pm IST

Uttam Kumar Reddy | ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నీటి పారుద‌ల‌పై మంత్రి ఉత్త‌మ్ స‌మీక్ష‌
Advertisement

Uttam Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ప్రత్యేక సమీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహ‌రి హాజ‌ర‌య్యారు.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతిపై సమగ్రంగా స‌మీక్షించారు. సీతమ్మసాగర్, మున్నేరు–పాలేరు లింక్ కాలువ పనులపై చర్చించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ అనుమతుల అంశాలపై అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతి, లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఉత్త‌మ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెండింగ్ పనుల వేగవంతానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Advertisement
Advertisement