Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం
Invest Telangana Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సు లక్ష్యాలు, పెట్టుబడుల అవకాశాలు, ఆశిస్తున్న ఫలితాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఉమ్మడి పది జిల్లాల పరిధిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది.
- ఉమ్మడి పది జిల్లాల్లో ప్రత్యేక అవగాహన సమావేశాలు
- ఇన్‌ఛార్జి మంత్రులతో సమన్వయానికి ప్రత్యేక అధికారుల నియామకం
Invest Telangana Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సు లక్ష్యాలు, పెట్టుబడుల అవకాశాలు, ఆశిస్తున్న ఫలితాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఉమ్మడి పది జిల్లాల పరిధిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రత్యేక అధికారులను ఆదేశించారు. జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశాల్లో గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలు, వివిధ రంగాల్లో పెట్టుబడుల ద్వారా సాధించాలనుకుంటున్న ఫలితాలను వివరించనున్నారు. సదస్సులో ఏర్పాటు చేయనున్న ప్రదర్శనలు, వివిధ రంగాలకు సంబంధించిన కార్యక్రమాలపైనా ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించనున్నారు.
ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వాన కమిటీ ద్వారా అధికారికంగా ఆహ్వానాలు పంపాలని సీఎస్ సూచించారు. జిల్లా యంత్రాంగం సహకారంతో వీలైనంత వరకు ఆయా జిల్లాల్లోనే సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకోసం ఉమ్మడి పది జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులతో పాటు ప్రత్యేక అధికారులను నియమించారు. హైదరాబాద్ జిల్లా బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించగా, ప్రత్యేక అధికారిగా జయేశ్ రంజన్‌ను నియమించారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రత్యేక అధికారిగా వికాస్‌రాజ్ వ్యవహరించనున్నారు. కరీంనగర్ జిల్లాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రత్యేక అధికారిగా బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కాను నియమించారు. మెదక్ జిల్లాకు మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ప్రత్యేక అధికారిగా డీఎస్ లోకేశ్‌కుమార్ బాధ్యతలు నిర్వహించనున్నారు.
నిజామాబాద్ జిల్లాకు మంత్రి దనసరి అనసూయ సీతక్క, ప్రత్యేక అధికారిగా డాక్టర్ యోగితా రాణాను నియమించారు. నల్గొండ జిల్లాకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రత్యేక అధికారిగా హరిచందన దాసరికి బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక అధికారిగా కె.ఇలంబర్తి వ్యవహరించనున్నారు. వరంగల్ జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రత్యేక అధికారిగా కృష్ణ ఆదిత్యను నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రత్యేక అధికారిగా వి.పి.గౌతమ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఖమ్మం జిల్లాకు మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ప్రత్యేక అధికారిగా అనుదీప్ దురిశెట్టి వ్యవహరించనున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mallikarjun Kharge | ఆ బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం : ఖర్గే
- ●Bitcoin | బిట్‌కాయిన్‌కు భారీ షాక్.. 60 వేల డాలర్ల దిగువకు ధర..
- ●KTR | డీలిమిటేషన్‌కు అనుకూలంగా ఓటు వేస్తం.. కానీ: కేటీఆర్
- ●Telangana Industrial Policy 2.0 | విదేశాలకు వెళ్లకుండానే విదేశీ విద్య.. తెలంగాణలో 11 కొత్త పాలసీలు!
- ●Trisha | "విశ్వంభర" మరోసారి వాయిదా - త్రిష కెరీర్లో రిలీజ్‌కు ఎక్కువ రోజులు టైమ్ పట్టిన సినిమా ఇదే
- ●blast in school | పాఠశాలలో భారీ పేలుడు.. ఆరుగురు చిన్నారులు మృతి

Mallikarjun Kharge | ఆ బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం : ఖర్గే

Bitcoin | బిట్‌కాయిన్‌కు భారీ షాక్.. 60 వేల డాలర్ల దిగువకు ధర..

KTR | డీలిమిటేషన్‌కు అనుకూలంగా ఓటు వేస్తం.. కానీ: కేటీఆర్

Telangana Industrial Policy 2.0 | విదేశాలకు వెళ్లకుండానే విదేశీ విద్య.. తెలంగాణలో 11 కొత్త పాలసీలు!






