త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bitcoin | బిట్‌కాయిన్‌కు భారీ షాక్.. 60 వేల డాలర్ల దిగువకు ధర..

Bitcoin | ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ మరోసారి 60వేల డాలర్ల దిగువకు పడిపోయింది. నవంబర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 23 శాతం విలువ కోల్పోయింది. క్రిప్టో మార్కెట్లలో వరుస హ్యాకింగ్ ఘటనలు, అమెరికాలో నియంత్రణపరమైన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. దీంతో బిట్‌కాయిన్‌తోపాటు ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

S

Business | Published On Nov 28, 2026, 3.18 pm IST

Bitcoin | బిట్‌కాయిన్‌కు భారీ షాక్.. 60 వేల డాలర్ల దిగువకు ధర..
Advertisement

Bitcoin | ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ మరోసారి 60వేల డాలర్ల దిగువకు పడిపోయింది. నవంబర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 23 శాతం విలువ కోల్పోయింది. క్రిప్టో మార్కెట్లలో వరుస హ్యాకింగ్ ఘటనలు, అమెరికాలో నియంత్రణపరమైన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. దీంతో బిట్‌కాయిన్‌తోపాటు ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

క్రిప్టో మార్కెట్‌ల‌లో అమ్మకాల ఒత్తిడి..

అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నప్పటికీ క్రిప్టో మార్కెట్ మాత్రం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. తాజాగా 2.3 శాతం లాభపడి 62వేల డాలర్ల స్థాయిని తాకిన బిట్‌కాయిన్, ఆ తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురైంది. దీంతో ధర 58,760 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 0.30 శాతం నష్టంతో 59,689 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నవంబర్ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు బిట్‌కాయిన్ విలువ 23 శాతం క్షీణించడం గమనార్హం. గత నాలుగేళ్లలో నవంబర్ నెలలో నమోదైన అతిపెద్ద పతనంగా ఇది నిలిచింది.

పతనానికి కారణాలివే..

క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు, సంబంధిత మార్కెట్ వ్యవస్థలపై ఇటీవల చోటుచేసుకున్న హ్యాకింగ్ ఘటనలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. మరోవైపు అమెరికాలో మధ్యంతర ఎన్నికల అనంతరం క్రిప్టో మార్కెట్‌పై నియంత్రణలు మరింత కఠినతరం అవ‌నున్నాయ‌నే అంచనాలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలతో పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిని బిట్‌కాయిన్‌ను విక్రయిస్తున్నారు. ధర మరింత తగ్గి 57వేల డాలర్ల స్థాయికి చేరితే భవిష్యత్తులో నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఎఫ్‌ఎక్స్‌ప్రో చీఫ్ మార్కెట్ అనలిస్ట్ అలెక్స్ కుప్ట్సికెవిచ్ హెచ్చరించారు.

అగ్ర‌ ఇన్వెస్టర్ల లాభాలు ఆవిరి..

బిట్‌కాయిన్‌ను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న ఇన్వెస్టర్లపైనా ధరల పతనం ప్రభావం చూపుతోంది. 1వేయి నుంచి 10వేల బిట్‌కాయిన్ల వరకు కలిగి ఉన్న పెట్టుబడిదారుల సగటు లాభాల మార్జిన్ సెప్టెంబర్ చివరి నాటికి 33.9 శాతంగా ఉండగా, ప్రస్తుత త్రైమాసికంలో అది కేవలం 5.7 శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది చివరి వరకు క్రిప్టో మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశముందని వెలో డేటా సీఈఓ ఫ్రెడరిక్ కాలిన్స్ అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement