త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inter Exams | ఇంట‌ర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుద‌ల‌.. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి ప‌రీక్ష‌లు

Inter Exams | ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల (Inter Exams) తేదీలు ఖ‌రార‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మార్చి 20 వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డు షెడ్యూల్ (Exam Schedule) విడుద‌ల చేసింది.

G

Telangana | Published On Nov 19, 2026, 5.25 pm IST

Inter Exams | ఇంట‌ర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుద‌ల‌.. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి ప‌రీక్ష‌లు
Advertisement

Inter Exams | త్రినేత్ర న్యూస్‌: ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల (Inter Exams) తేదీలు ఖ‌రార‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మార్చి 20 వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డు షెడ్యూల్ (Exam Schedule) విడుద‌ల చేసింది. ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి 24 నుంచి, రెండ‌వ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. మొద‌టి సంవ‌త్స‌రం సైన్స్ స‌బ్జెక్టుల ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 11 నుంచి 18వ తేదీ వ‌ర‌కు, రెండో సంవ‌త్స‌రం ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 10 వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. ఇంగ్లీష్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు మొద‌టి సంవత్స‌రానివి జ‌న‌వ‌రి 29న‌, రెండో సంవ‌త్స‌రానికి 30న నిర్వ‌హించ‌నున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమ‌న్ వాల్యూస్ ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 29న, ఎన్విరాన్‌మెంట‌ల్ ఎడ్యుకేష‌న్ ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 27న నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement
Advertisement