త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Idupu Kayitham | ఇడుపుకాయితం నుంచి పెళ్లి పాట రిలీజ్ – ఐదుగురు సింగ‌ర్ల‌తో….

ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఇడుపుకాయితం సినిమా నుంచి పెళ్లి పాట‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట‌ను ఐదుగురు సింగ‌ర్లు క‌లిసి పాడ‌టం గ‌మ‌నార్హం. బ‌న్నీవాస్‌తో క‌లిసి డైరెక్ట‌ర్ సుకుమార్ స‌తీమ‌ణి త‌బిత నిర్మిస్తున్న ఈ తెలంగాణ సినిమా డిసెంబ‌ర్ 11న రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Nov 21, 2026, 2.49 pm IST

Idupu Kayitham | ఇడుపుకాయితం నుంచి పెళ్లి పాట రిలీజ్ – ఐదుగురు సింగ‌ర్ల‌తో….
Advertisement

Idupu Kayitham | ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న సినిమా ఇడుపుకాయితం. నిర్మాత బ‌న్నీవాస్‌తో క‌లిసి అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స‌తీమ‌ణి త‌బిత నిర్మిస్తున్నారు. వంశీరెడ్డి దొండ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోతెర‌కెక్కుతోన్న ఈ సినిమా డిసెంబ‌ర్ 11న రిలీజ్ కాబోతుంది.

పెళ్లి పాట‌....

టైటిల్‌తోనే తెలుగు ప్రేక్ష‌కుల్లో ఇడుపుకాయితం ఆస‌క్తిని రేకెత్తించింది. ఆ త‌ర్వాత ఒక్కో పాట‌ను రిలీజ్ చేస్తూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతున్నారు మేక‌ర్స్‌. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లి సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'గోగులు గోగులు గోపాలకృష్ణుడు సేలి అంటూ సాగిన ఈ పాట‌ను ఐదుగురు సింగ‌ర్లు క‌లిసి పాడ‌టం గ‌మ‌నార్హం. అభిక్య తనికెళ్ల, తరుణి, రచిత రాయప్రోలు, జయశ్రీ పల్లెం, స్నిగ్ధ శర్మ ఆల‌పించారు. కొంగ‌రి కృష్ణ సాహిత్యాన్ని అందించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. హీరోహీరోయిన్ల పెళ్లి వేడుక నేప‌థ్యంలో వ‌చ్చే పాట ఇద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. పెళ్లి కొడుకును శ్రీకృష్ణుడితో పోలిస్తూ సాగిన లిరిక్స్‌, సింగ‌ర్ల వాయిస్‌, విజువ‌ల్స్ ఈ పాట‌కు హైలైట్‌గా నిలిచాయి.

తెలంగాణ న‌టీన‌టుల‌తో...

ఇడుపుకాయితం షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. షూటింగ్‌తోనే ఈసినిమా థియేట్రిక‌ల్‌తో పాటు ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఫోక్ సింగ‌ర్ నాగ‌దుర్గ హీరోయిన్‌గా న‌టిస్తోన్న రెండో తెలుగు సినిమా ఇది. ఇడుపుకాయితంలో చాలా వ‌ర‌కు తెలంగాణ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement
Advertisement