CV Anand | ఆయన ఐపీఎస్.. ఆమె ఐఐటీ.. సీవీ ఆనంద్ దంపతుల అద్భుత ప్రయాణం!
CV Anand | తెలంగాణ నూతన డీజీపీగా సీనీయర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ, కుటుంబ సభ్యులు, సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈనేపథ్యంలో సీవీ ఆనంద్ కుటుంబ నేపథ్యం అందరినీ ఆకర్షిస్తున్నది..
CV Anand | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ నూతన డీజీపీగా సీనీయర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ, కుటుంబ సభ్యులు, సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈనేపథ్యంలో సీవీ ఆనంద్ కుటుంబ నేపథ్యం అందరినీ ఆకర్షిస్తున్నది..
సీవీ ఆనంద్ పక్కా హైదరాబాదీ. ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూరు. అయితే ఆయన తల్లిదండ్రులు యశోదాదేవి, చామ దామోదర్ రెడ్డి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 1968, జూన్ 5న పాతబస్తీలోని జజ్జిఖానా మెటర్నిటీ దవాఖానలో ఆనంద్ జన్మించారు. దామోదర్‌రెడ్డి అటవీశాఖలో ఫారెస్టు రేంజర్‌గా పని చేస్తూ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా పదవీ విరమణ పొందారు.
మంచి క్రికెటర్..
ఆనంద్ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. విద్యారణ్య హైస్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. క్రికెట్‌లో మంచి పట్టు ఉన్నది. హైదరాబాద్ అండర్ 19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన 1986లో ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొన్నారు. నిజాం కాలేజీలో బీఏ, ఉస్మానియాలో ఎంఏ (ఎకనామిక్స్) పూర్తి చేశారు. గోల్డ్ మెడల్ కూడా సాధించారు. రంజీ ట్రోఫీలో అవకాశం రాకపోవడంతో, 1990లో సివిల్ సర్వీసెస్‌పై దృష్టి పెట్టారు. దీంతో తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో 147వ ర్యాంకు సాధించి.. తన 22 ఏండ్ల వయస్సులో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
భర్తకు తగిన భార్య..
నిజాం కాలేజీలో తన సహాధ్యాయి అయిన లలితను (Lalitha Anand) సీవీ ఆనంద్ వివాహం చేసుకున్నారు. భర్తకు తగ్గ భార్యగా లలితా ఆనంద్ తనదైన మార్కు చూపారు. భర్త కెరీర్, పిల్లల పెంపకం కోసం చదువును మధ్యలో ఆపేశారు. 40 ఏండ్ల వయసులో మళ్లీ పుస్తకాలు చేతపట్టి ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ (మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ / కార్పొరేట్ ఫైనాన్స్) పూర్తి చేశారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ రీసెర్చర్‌గా చేరి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. చిన్నప్పటి నుంచి సాంప్రదాయ నృత్యాలంటే ఇష్టం. కానీ చదువు, కుటుంబం కోసం ఆపేశారు. 50 ఏండ్లు పైబడిన వయసులో మళ్లీ నాట్యం వైపు మనసు మళ్లించి.. 57 ఏండ్ల వయసులో భరతనాట్యం అరంగేట్రం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆదర్శ దంపతులు..
సీవీ ఆనంద్-లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చామ మిలింద్. తండ్రి బాటలోని పయణించిన మిలింద్.. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదిగారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇండియా అండర్-19, ఆర్‌సీబీ (ఐపీఎల్)లో కూడా ఆడారు. మరో కుమారుడు వీఎఫ్ఎక్స్ రంగంలో రాణిస్తున్నారు.
కాగా, సీవీ ఆనంద్ ఇప్పటికీ క్రికెట్, టెన్నీస్ ఆడుతూ ఫిట్‌నెస్‌ను కాపాడుతారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున 2025-26 సీజన్‌లో ఆయన ఐదు సెంచరీలు కూడా చేశారు. టెన్నిస్‌లోనూ జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. ఇక లలితా డయాబెటిస్‌ను రివర్స్ చేసుకుని ఫిట్‌నెస్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చివరగా..
వయసు, పరిస్థితులు ఏవైనా.. సాధించాలనే పట్టుదల ఉంటే దేనిని అందుకోవచ్చు. భర్త పోలీస్ సేవలో, భార్య అకాడెమిక్స్ అండ్ ఆర్ట్స్‌లో తమదైన మార్కు వేశారు. మరోవైపు పిల్లలను కూడా మంత్రి ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దారు.
తాజావార్తలు
- ●RTC Bus | పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే..
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు
- ●BSNL | బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే నెలవారీ ప్లాన్..
- ●KBR Park | 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే.. వాకర్లకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు..
- ●Para Cricketer | రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం.. పారా క్రికెటర్‌కు ఆహ్వానం
- ●Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో మార్కెట్లకు మళ్లీ షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

RTC Bus | పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే..

Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు

BSNL | బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే నెలవారీ ప్లాన్..

KBR Park | 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే.. వాకర్లకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు..






