త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | ఇజ్రాయెల్ అధికారితో కొండల్ రెడ్డి ఏం హోదాలో భేటీ అయిండు.. రేవంత్‌ సమాధానం చెప్పాలి

Manne Krishank | ఎనుముల కొండ‌ల్‌రెడ్డి ఏ హోదాలో ఇజ్రాయెల్ అధికారితో భేటీ అయ్యార‌ని.. దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల‌ని బీఆర్ఎస్ నాయ‌కులు మ‌న్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి, కొండల్ రెడ్డి పర్యటనల‌పై కేంద్రం ప్రభుత్వం నిఘా పెట్టి విచారణ చేపట్టాలన్నారు.

S

Telangana | Published On Aug 31, 2026, 1.52 pm IST

Manne Krishank | ఇజ్రాయెల్ అధికారితో కొండల్ రెడ్డి ఏం హోదాలో భేటీ అయిండు.. రేవంత్‌ సమాధానం చెప్పాలి
Advertisement
  • రేవంత్, కొండ‌ల్‌రెడ్డి ప‌ర్య‌ట‌న‌లపై కేంద్రం విచార‌ణ జ‌రిపించాలి
  • ఒక్కసారే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్‌కు చైర్మన్ అయిపోయాడు!
  • అలాంటి ఆణిముత్యం జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉండ‌డం ఎందుకు?
  • నాసాకో, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌కో, శ్రీహరికోటకో కొండల్ రెడ్డిని పంపితే బాగుంటది
  • రేవంత్ ప్ర‌భుత్వానికి బీఆర్ఎస్ నాయ‌కులు మ‌న్నె క్రిశాంక్ చుర‌క‌లు

Manne Krishank | త్రినేత్ర‌.న్యూస్‌: ఎనుముల కొండ‌ల్‌రెడ్డి ఏ హోదాలో ఇజ్రాయెల్ అధికారితో భేటీ అయ్యార‌ని.. దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల‌ని బీఆర్ఎస్ నాయ‌కులు మ‌న్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకోవద్దని రాహుల్ గాంధీ గతంలో స్టేట్‌మెంట్ ఇచ్చాడని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి, కొండల్ రెడ్డి పర్యటనల‌పై కేంద్రం ప్రభుత్వం నిఘా పెట్టి విచారణ చేపట్టాలన్నారు. రేవంత్ విదేశీ పర్యటనలన్నీ తన అన్నదమ్ముల మేలు కోసమే తప్పా రాష్ట్రం కోసం కాదని నిరూపించామ‌న్నారు. రేవంత్‌కు దమ్ముంటే కేటీఆర్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో క్రిశాంక్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ఆ యూనివర్సిటీలు ఏమైనా బావర్చి రెస్టారెంట్లా!

రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నాడు. తెలంగాణ ఆత్మ గౌరవంతో ముడి పెడుతున్నాడు. అమెరికా పర్యటనలో చివరి రెండు రోజుల పర్యటనపై రేవంత్ రెడ్డి సమాచారం ఇవ్వలేదు. ఫోర్త్ సిటీకి హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తెస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆ యూనివర్సిటీలు ఏమైనా బావర్చి రెస్టారెంట్లా.. ఎక్కడ పడితే అక్కడ పెట్టేందుకు.!

కొండల్ రెడ్డికి శ్రీధర్‌బాబు స్పోక్ పర్సనా?

అక్రమంగా దోచుకున్న డబ్బులను విదేశాల్లో దాచుకునేందుకు రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళాలని అనుకున్నాడు. మంత్రి శ్రీధర్‌బాబు ఎనుముల కొండల్ రెడ్డికి స్పోక్ పర్సనా? రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై మంత్రి శ్రీధర్ బాబు, కొండల్ రెడ్డి.. ఎవరు సమాధానం చెప్తారు? ఇజ్రాయెల్ అధికారి ఎష్రాఫ్ ఎనుముల కొండల్ రెడ్డితో భేటీ అయ్యాడు. అంతకుముందే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఇజ్రాయెల్ అధికారితో భేటి అయ్యారు.

ఒక్కసారే ఎనుముల కొండల్ రెడ్డి ఇజ్రాయిల్ డిఫెన్స్ సిస్టమ్‌కు చైర్మన్ అయిపోయాడు.! ఇజ్రాయెల్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవద్దని రాహుల్ గాంధీ గతంలో స్టేట్‌మెంట్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి బ్రదర్ కొండల్ రెడ్డి ఇజ్రాయిల్ కంపెనీతో ఎలా ఒప్పందం చేసుకుంటాడని రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ అడగాలి కదా? హవాలా , షెల్ కంపెనీ ఇతర వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా రేవంత్ రెడ్డి, ఆయన బ్రదర్స్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి, ఆయన బ్రదర్స్ విదేశీ పర్యటనలపై కేంద్రం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.

ఆ ఆణిముత్యం జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఎందుకు?

అమెరికాకు పోతే ఒక ఒప్పందం.. ఇజ్రాయెల్ పోతే మరొక ఒప్పందం అన్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. అనుముల జగదీశ్వర్ రెడ్డి స్వచ్ బయో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి అంటూ గతంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు చెప్పాడు. ఇప్పుడేమో రక్షణ రంగంలో తమ్ముడు కొండల్ రెడ్డి ఆణిముత్యమని అంటున్నారు. అలాంటి ఆణిముత్యం జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఎందుకు ఉన్నట్లు? నాసాకో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌కో శ్రీహరి కోటకో ఎనుముల కొండల్ రెడ్డిని రేవంత్ పంపితే బాగుంటుంది

తిరుపతిరెడ్డి కొడంగల్‌లో జెడ్ ప్లస్ క్యాటగిరితో తిరుగుతున్నాడు. కొడంగల్‌ను ఆయనకు రాసిచ్చారు. రేవంత్ మరో సోదరుడు కృష్ణా రెడ్డికి ఫోర్త్ సిటీ అప్పజెప్పారు. ఎనుముల జగదీశ్వర్ రెడ్డికి అమెరికా వ్యవహారాలు అప్పజెప్పారు. రేవంత్ సోదరుల షెల్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం చేకూరుస్తున్న అనుచిత లబ్ధిపై కేంద్రం విచారణ చేపట్టాలి అని మ‌న్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement