Driving Licence | మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. ఇకపై ఆ పాఠాలు వినాల్సిందే!
Driving Licence | మీరు డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) తీసుకోవాలనుకుంటున్నారా?.. అంతో ఇంతో డబ్బులు ఇస్తే అంతా ఏజెంట్లే చూసుకుంటార్లే అని తేలికగా తీసుకోకండి.
Driving Licence | త్రినేత్ర.న్యూస్: మీరు డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) తీసుకోవాలనుకుంటున్నారా?.. అంతో ఇంతో డబ్బులు ఇస్తే అంతా ఏజెంట్లే చూసుకుంటార్లే అని తేలికగా తీసుకోకండి. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను రవాణా శాఖ అధికారులు కఠినతరం చేస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో లోపాలను గుర్తించిన అధికారులు వాటిలో మార్పులు చేస్తున్నారు. ఇకపై రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్‌పై పూర్తి అవగాహన కల్పించాకే లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ట్రాఫిక్స్ రూల్స్, రోడ్డు భద్రతకు సంబంధించి మూడు గంటల పాటు ఉండే వీడియోను (Traffic Safety Videos) తప్పనిసరిగా పాఠాలు వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని కూకట్ పల్లి ఆర్టీఏ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇతర జోన్లకు కూడా విస్తరించనున్నారు.
మధ్యవర్తుల ప్రమేయం, కొందరు అధికారుల అవినీతి కారణంగా డ్రైవింగ్ టెస్ట్ (Test Drive) లేకుండానే పర్మినెండ్ లైసెన్సులు మంజూరవుతున్నట్లు గుర్తించిన అధికారులు.. అక్రమాలను నివారించడంతోపాటు ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియో పాఠాలను తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు వీటిని తప్పనిసరిగా చూడాలనే నిబంధన విధించారు. ఈ వీడియోలు చూసిన తర్వాతే డ్రైవింగ్ టెస్ట్‌కు అనుమతిస్తారు. డ్రైవింగ్ టెస్టులో క్వాలీఫై అయితే లైసెన్స్ మంజూరు చేస్తారు.
ప్రస్తుత విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ముందుగా లెర్నింగ్ లైసెన్స్(LLR)కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఎల్ఎల్ఆర్ జారీ చేస్తారు. ఇది అందిన 30 రోజుల నుంచి ఆరు నెలల్లోపు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ముందుగా ఆర్టీఏ కార్యాలయలంలో మూడు గంటల పాటు వీడియో పాఠాలు చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ట్రాక్ టెస్ట్‌కు పిలుస్తారు. కాగా, దరఖాస్తుదారుడు నిజంగా వీడియోలు చూశారా.. లేదా అనేది కూడా పరిశీలిస్తారు. ఇందుకోసం టీజీ ఆన్‌లైన్‌లో మాడ్యూల్స్ అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్న సమయంలో దరఖాస్తుదారుల ముఖకవళికలు నమోదుచేస్తారు. దానిద్వారా ట్రాక్ టెస్టుకు అనుమతిస్తారు.
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి




