త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | నేడు ఈ నాలుగు జిల్లాల్లో వ‌డ‌గండ్ల వాన‌.. ఆరంజ్ అల‌ర్ట్ జారీ

Telangana | ద్రోణి, గాలి అనిశ్చితితో పాటు ఉపరితల చక్రవాకం ప్రభావంతో రాష్ట్రంలో (Telangana) నాలుగు రోజుల పాటు తేలిక‌పాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

G

Telangana | Published On Apr 1, 2026, 6.28 am IST

Telangana | నేడు ఈ నాలుగు జిల్లాల్లో వ‌డ‌గండ్ల వాన‌.. ఆరంజ్ అల‌ర్ట్ జారీ
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్‌: ద్రోణి, గాలి అనిశ్చితితో పాటు ఉపరితల చక్రవాకం ప్రభావంతో రాష్ట్రంలో (Telangana) నాలుగు రోజుల పాటు తేలిక‌పాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో బుధ‌వారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో (Thunderstorm) కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల‌కు ఆరంజ్ అల‌ర్ట్ జారీ చేసింది.

అదేవిధంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, నిర్మల్, నిజామాబాద్, జ‌గిత్యాల, సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, జ‌న‌గామ‌, సిద్దిపేట, భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురుస్తుంద‌ని తెలిపింది. కు ఆరెంజ్‌ హెచ్చరికలు, రేపు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ రాత్రి వేళల్లో ఉక్కపోత వాతావరణం ఉంటుందని పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement