త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weather Update | శ‌నివారం నుంచి మ‌రింత పెరుగ‌నున్న ఎండ‌లు

Weather Update | రాష్ట్రంలో శ‌నివారం (మే 16) నుంచి ఎండల తీవ్రత మరింత (Weather Update)పెరుగ‌నుంది. ఉత్తర తెలంగాణ (Telangana) జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త అధికంగా ఉంటుంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది.

G

Telangana | Published On May 15, 2026, 6.37 am IST

Weather Update | శ‌నివారం నుంచి మ‌రింత పెరుగ‌నున్న ఎండ‌లు
Advertisement

Weather Update | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో శ‌నివారం (మే 16) నుంచి ఎండల తీవ్రత మరింత (Weather Update)పెరుగ‌నుంది. ఉత్తర తెలంగాణ (Telangana) జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త అధికంగా ఉంటుంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాకు రెడ్‌ అలర్ట్‌, మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వెల్ల‌డించింది. గ‌త రెండు రోజులుగా ఎండ తీవ్రత స్వల్పంగా పెరుగుతున్న‌ద‌ని పేర్కొన్న‌ది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉందని తెలిపింది.

ఈనెల 16 నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది. కొత్తగూడెం జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతాయ‌ని, 17, 18 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంద‌ని తెలిపింది.

 

Advertisement
Advertisement