Heat Weaves | నేటి నుంచి మరింత పెరుగనున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Heat Weaves | రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నది. పలు జిల్లాల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఎండ వేడి (Heat Weaves ) మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది.
Heat Weaves | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నది. పలు జిల్లాల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఎండ వేడి (Heat Weaves ) మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. బుధ, గురువారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. ఈ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
ఇక వచ్చే నాలుగైదు రోజులు ఉత్తర తెలంగాణలో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మరోవైపు కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహభూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ.వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని పేర్కొంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






