త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | రాష్ట్రంలో రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో..

Rain Alert | వేస‌వి ప్రారంభానికి ముందే ఎండ‌, ఉక్క‌పోత‌తో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు అందించింది. రాష్ట్రంలో రెండు రోజుల‌పాటు వ‌ర్షాలు (Rain Alert) కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

G

Telangana | Published On Feb 23, 2026, 10.06 am IST

Rain Alert | రాష్ట్రంలో రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో..
Advertisement

Rain Alert | త్రినేత్ర‌.న్యూస్‌: వేస‌వి ప్రారంభానికి ముందే ఎండ‌, ఉక్క‌పోత‌తో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు అందించింది. రాష్ట్రంలో రెండు రోజుల‌పాటు వ‌ర్షాలు (Rain Alert) కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఆదివారం రాత్రి ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో వాన కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు సూర్యుడు మ‌బ్బుల చాటునే ఉండిపోయాడు.

కాగా, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. అక్క‌డ‌క‌క్క‌డ‌ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

https://x.com/balaji25_t/status/2025758693883826662

 

సోమవారం మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌ర‌కు మెద‌క్‌, సిద్దిపేట‌, కామారెడ్డి, వికారాబాద్‌, యాదాద్రి భువ‌న‌గిరి, సంగారెడ్డి, నిజామాబాద్‌, సిరిసిల్ల‌, జ‌గిత్యాల‌, మంచిర్యాల‌, ఆసిఫాబాద్ జిల్లాల్లో వ‌ర్షం ప‌డుతుంద‌ని తెలిపారు.

ఇక సోమవారం రాత్రి నుంచి మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము వ‌ర‌కు రంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, సూర్యాపేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, మెద‌క్‌, సిద్దిపే సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement