త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rain Alert | ఈ జిల్లాల్లో నేడు భారీ వ‌ర్షాలు.. రెడ్ అల‌ర్ట్ జారీ

Heavy Rain Alert | రాష్ట్రంలో శ‌ని, ఆదివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ‌ని (Heavy Rain Alert) హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్ల‌డించింది.

G

Telangana | Published On Jun 6, 2026, 8.21 am IST

Heavy Rain Alert | ఈ జిల్లాల్లో నేడు భారీ వ‌ర్షాలు.. రెడ్ అల‌ర్ట్ జారీ
Advertisement

Heavy Rain Alert | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో శ‌ని, ఆదివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ‌ని (Heavy Rain Alert) హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్ల‌డించింది. శనివారం అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్ల‌గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్ల‌డించింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది.

భారీ వర్షాలకుతోడు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ తీగలు, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చ‌రించింది.

15 నాటికి రుతుప‌వ‌నాలు..

కాగా, ఇప్పటికే కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో రెండుమూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని.. ఈనెల 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది.

Advertisement
Advertisement