త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accidents | నెత్తురోడిన ర‌హ‌దారులు.. వేర్వేరు ప్ర‌మాదాల్లో న‌లుగురు మృతి

Road Accidents | ర‌హ‌దారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్ర‌మాదాల్లో న‌లుగురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజురాబాద్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు, క‌ర్ణాట‌క‌లో ఇద్ద‌రు మృతి చెందారు.

S

Telangana | Published On Oct 24, 2026, 12.49 pm IST

Road Accidents | నెత్తురోడిన ర‌హ‌దారులు.. వేర్వేరు ప్ర‌మాదాల్లో న‌లుగురు మృతి
Advertisement

Road Accidents | త్రినేత్ర న్యూస్ : ర‌హ‌దారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్ర‌మాదాల్లో న‌లుగురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజురాబాద్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు, క‌ర్ణాట‌క‌లో ఇద్ద‌రు మృతి చెందారు. ఈ రెండు ప్ర‌మాదాలు కూడా శ‌నివారం ఉద‌యం చోటు చేసుకున్నాయి.

హుజురాబాద్ మండ‌లం రంగాపూర్ స‌మీపంలో వేగంగా వెళ్తున్న‌ లారీని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్య‌క్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారంం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని క్షతగాత్రులను ఎంజీఎమ్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన వారిగా గుర్తించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కర్ణాటక బీద‌ర్‌లో కారు, బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మ‌రో నలుగురు గాయపడ్డారు. గాయ‌ప‌డ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బీదర్‌ జిల్లా బసవ కల్యాణి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను సంగారెడ్డి జిల్లా మానూర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement
Advertisement