Nalgonda | ధాన్యం సేకరణలో మిల్లర్ల వేధింపులు.. ఐకేపీ సెంటర్ ఇన్‌చార్జ్ ఆత్మహత్యాయత్నం
Nalgonda | నల్లగొండ (Nalgonda) జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడెంలో ఐకేపీ సెంటర్ (IKP Center) ఇన్‌చార్జ్ కొప్పుల సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Nalgonda | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ (Nalgonda) జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడెంలో ఐకేపీ సెంటర్ (IKP Center) ఇన్‌చార్జ్ కొప్పుల సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన రైతులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ధాన్యం సేకరణలో ఓవైపు మిల్లర్ల వేధింపులు, మరోవైపు రైతుల ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు అందులో పేర్కొన్నాడు. `నా ఆత్మహత్యతో నైనా కొనుగోళ్లు సజావుగా సాగాలి` అంటూ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు.
సమాచారం అందుకున్న రైతులు భారీగా కొనుగోలు కేంద్రానికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుతం సైదులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. బాధితుడు సైదులును నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దవాఖానలో పరిశీలించారు.
అసలు ఏం జరిగిందంటే..
బచ్చన్నగూడెంలో నెల రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. జీ.ఎడవల్లి గ్రామానికి చెందిన పీఏసీఎస్ స్టాఫ్ అసిస్టెంట్ కొప్పుల సైదులు (30) ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం కొనుగోలు నుంచి మిల్లులకు పంపేవరకు బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఆరు గ్రామాలకు చెందిన రైతులు ఈ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువస్తుంటారు.
అయితే గత కొన్నిరోజులుగా సకాలంలో లారీలు కేంద్రానికి రాకపోవటం, మిల్లర్లు తాలు పేరుతో ధాన్యం అన్‌లోడ్ చేసుకోవడానికి నిరాకరిస్తుండటంతో.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు కుప్పలుగా పేరుకుపోయాయి. దీంతో తూకం వేగవంతం చేయాలని మూడు రోజులుగా రైతులు ఒత్తిడి చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో ఆందోళన చెందిన సైదులు కొనుగోలు కేంద్రం ఎదుటే సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






