Shoot Out | ఓఆర్ఆర్పై కాల్పుల కలకలం.. దొంగను పట్టుకునేందుకు పోలీసుల ఫైరింగ్
Shoot Out | హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై కాల్పులు కలకలం (Shoot Out) సృష్టించాయి. మోస్ట్ వాంటెండ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రంలో అతనిపై పోలీసులు కాల్పులు జరిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌లో (Hyderabad) ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
Shoot Out | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై కాల్పులు కలకలం (Shoot Out) సృష్టించాయి. మోస్ట్ వాంటెండ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రంలో అతనిపై పోలీసులు కాల్పులు జరిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌లో (Hyderabad) ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రెండేండ్లుగా వెతుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే అవకాశం రావడంతో నల్లగొండ సీసీఎస్ (CCS) పోలీసులు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆదిభట్ల సమీపంలోని బొంగులూరు గేటు (Bongulur Gate) సమీపంలో ఓఆర్ఆర్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అయితే అతడు తిరగబడి తప్పించేందుకు ప్రయత్నించడంతో అతని కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
గాయపడిన అతడిని అదుపులోకి తీసుకుని వనస్థలిపురం దవాఖానకు తరలించారు. నిందితుడిని ఏపీకి చెందిన భూష్మి శ్రీకాంత్‌గా గుర్తించారు. అతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. అందులో పదికిపైగా దొంగతనాలు, నాలుగేండ్ల క్రితం ఏపీలో ఓ కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు






