Balaraju Yadav | పిచ్చి పిచ్చి మాట్లాడితే మూతి పగుల్తది.. ఖబర్ధార్
Balaraju Yadav | మైనంపల్లి హనుమంతరావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని.. ఆయనను అర్జెంట్‌గా పిచ్చాసుపత్రిలో చేర్పించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ విమర్శించారు. సీఎం రేవంత్ మెప్పు కోసమే మైనంపల్లి కేటీఆర్‌ను టార్గెట్ చేశారని ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు.
- మైనంపల్లిని అర్జెంట్‌గా పిచ్చాసుపత్రిలో చేర్పించాలి
- సిద్దిపేట, సిరిసిల్ల తర్వాత.. ముందు మల్కాజిగిరి గెలువు
- ఈ ప్రభుత్వంలో ఒక్క యాదవ మంత్రి అయినా ఉండా?
- భూపాలపల్లి డీటీవో వెంకన్నను లారీతో తొక్కించి చంపారు
- తెలంగాణ భవన్‌లో మైనంపల్లిపై దుదిమెట్ల బాలరాజు యాదవ్ ధ్వజం
Balaraju Yadav | త్రినేత్ర.న్యూస్: మైనంపల్లి హనుమంతరావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని.. ఆయనను అర్జెంట్‌గా పిచ్చాసుపత్రిలో చేర్పించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. మైనంపల్లి సిద్దిపేట, సిరిసిల్ల కాకుండా ముందు మల్కాజిగిరిలో గెలవాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క యాదవ మంత్రి అయినా ఉన్నాడా అని ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్‌కు సిద్ధ రామయ్యను తీసుకొచ్చి ఆయన గొంతు కోశారని ఆరోపించారు. సీఎం రేవంత్ మెప్పు కోసమే మైనంపల్లి కేటీఆర్‌ను టార్గెట్ చేశారని ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు.
ఇక వదిలిపెట్టం..
రేవంత్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కలవడం లేదు. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. పాత కాంగ్రెస్ వాళ్లను రేవంత్ కలవడం లేదు. కాంగ్రెస్‌లో కుతకుత లాంటి పరిస్థితి ఉంది. ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు. ముందుంది మొసళ్ల పండగ అని దూదిమెట్ల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైనంపల్లి ఒకసారి కేటీఆర్ మీద మాట్లాడితే వదిలి పెట్టినం. రెండోసారి మాట్లాడితే పోనీ అనుకున్నాం. ఇక వదిలి పెట్టం.
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మూతి పగలగొడతం అని బాలరాజు యాదవ్ హెచ్చరించారు.
హైదరాబాద్‌కు పెట్టుబడులు తెచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన కేటీఆర్‌ను అంటే ఊరుకుంటామా? సోషల్ మీడియాలో మైనంపల్లి మనుషులు కేటీఆర్‌పై అడ్డమైన ట్రోలింగ్‌లు చేస్తున్నారు. బాల్కసుమన్ మీద అక్రమ కేసు పెట్టారు. మైనంపల్లి ఆయన కొడుకు రోహిత్ అండ్ కో మీద కేసులు పెట్టరా? కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే, అడిగితే , మాట్లాడితే భౌతిక దాడులు చేస్తున్నారు. విసునూరి రాంచంద్రారెడ్డి వారసుడు రేవంత్ రెడ్డి. భూపాలపల్లిలో DTO వెంకన్నను లారీలతో తొక్కించి చంపేశారు అని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది. అసమర్థ, పనికిరాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మైనంపల్లి హనుమంతరావుకు పిచ్చి పట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. ప్రజల్లో పేరున్న నాయకుడు కేటీఆర్. ఏడాదిలోనే సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఎమ్మెల్యేగా రాజీనామా చేశాడు.
ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో 68,219 ఓట్ల మెజార్టీతో గెలిచిన నాయకుడు కేటీఆర్. మైనంపల్లి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు.
మైనంపల్లి హనుమతురావుపై కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కేసీఆర్ స్ఫూర్తితో కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల కోసం పని చేస్తున్న కేటీఆర్‌ను ఊసరవెల్లి లాంటి హనుమంతరావు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. రాజకీయ భిక్ష కోసం కేటీఆర్ కాళ్ళు పట్టుకున్న వ్యక్తి హనుమంతరావు. ఖబడ్దార్ మైనంపల్లి, ఇంకోసారి కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అని తీవ్రంగా హెచ్చరించారు.
ఒక్కొక్కరి తుక్కు వదిలిస్తం..
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సర్వేలో ఇప్పుడు మాట్లాడే నాయకులు ఓడిపోతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సైనికులుగా మారి ఒక్కొకరి తుక్కు వదలగొడుతాం. కాంగ్రెస్ నాయకులు ఇంకోసారి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. 1983 నుంచి కేసీఆర్ హయాం వరకు కేబినెట్ లో యాదవులు మంత్రులుగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో యాదవ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. మోసపూరిత హామీలతో ఈ ప్రభుత్వం యాదవులను మోసం చేసింది. 7 వేల కోట్ల రూపాయలు కేసీఆర్ హయాంలో గొల్ల కురుమల కోసం ఖర్చు చేశాం. బీర్ల ఐలయ్య యాదవ్ యాదవ సామాజిక వర్గం కోసం పనిచేయడం లేదు. ముఖ్యమంత్రి ఢిల్లీకి తిరిగితే, మా నాయకులు గల్లీలో తిరుగుతున్నారు అని బాలరాజు యాదవ్ విమర్శించారు.
వరుణ్ గాంధీ బీజేపీలో ఎందుకున్నరు?
కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లడం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. మరి ఇందిరాగాంధీ కోడలు మేనక గాంధి కాంగ్రెస్‌లో ఎందుకు లేరు? బయటకు వెళ్లి పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? ఆమె కొడుకు వరుణ్ గాంధీ బీజేపీలో ఎందుకు ఉన్నారు? గూట్లో రాయి తియ్యలేనోడు, ఏట్లో రాయి తీస్తా అన్నట్లు ఉంది మైనంపల్లి పరిస్థితి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | దరఖ్తస్తు చేసిన వెంటనే పాస్‌బుక్‌లు ఇవ్వండి
- ●TN Assembly | ప్రేమలత విజయకాంత్‌పై పన్నీర్ సెల్వం ఫన్నీ పంచ్.. పగలబడి నవ్విన సభ్యులు
- ●FD Interest Rates | 3 ఏళ్ల కాలానికి ఎఫ్డీలకు అత్యధిక వడ్డీ రేట్లను ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
- ●Harish Rao | ఎత్తు పొడవులతో ప్రజలకు ఉపయోగం ఉండదు రేవంత్.. హరీశ్ కౌంటర్
- ●Minister Vakiti Srihari | మత్తు వదలండి.. మైదానాలు చేరండి.. యువతకు మంత్రి వాకిటి శ్రీహరి పిలుపు
- ●Aliganj Fire Accident | లక్నో కోచింగ్ సెంటర్లో ఘోర అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో పైనుంచి దూకేసిన స్టూడెంట్స్

Ponguleti Srinivas Reddy | దరఖ్తస్తు చేసిన వెంటనే పాస్‌బుక్‌లు ఇవ్వండి

TN Assembly | ప్రేమలత విజయకాంత్‌పై పన్నీర్ సెల్వం ఫన్నీ పంచ్.. పగలబడి నవ్విన సభ్యులు

FD Interest Rates | 3 ఏళ్ల కాలానికి ఎఫ్డీలకు అత్యధిక వడ్డీ రేట్లను ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

Harish Rao | ఎత్తు పొడవులతో ప్రజలకు ఉపయోగం ఉండదు రేవంత్.. హరీశ్ కౌంటర్






