Ponguleti Srinivas Reddy | దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్‌లు ఇవ్వండి
Ponguleti Srinivas Reddy | రైతులు దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్‌లు అందేలా పారదర్శక కార్యాచరణను రూపొందించామని.. రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.65 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు తెలిపారు.
- రైతుల భూములకు స్పష్టమైన హక్కులు కల్పిద్దాం
- వారు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండొద్దు
- సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచండి
- జిల్లాకో మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి అమలు చేస్తాం
- ఏడాది కాలంలో 3.65 లక్షల పాస్‌బుక్‌ల అందజేశాం
- రెవెన్యూ అధికారుల టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: రైతులు దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్‌లు అందేలా పారదర్శక కార్యాచరణను రూపొందించామని.. రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 2025, ఏప్రిల్ 14 నుంచి భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.65 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు తెలిపారు.
గతంలో పాస్‌బుక్ కోసం రైతులు నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. రైతు దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్ అందే విధంగా వ్యవస్థను పారదర్శకంగా, వేగవంతంగా రూపొందించాం. రైతు ఒక్కసారి దరఖాస్తు చేస్తే తిరిగి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలి. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జత చేసే నిబంధనను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఐదు మండలాల్లో పరిస్థితులను సమీక్షించాను. త్వరలోనే రెండో దశలో ప్రతి జిల్లాకు ఒక మండలంలో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలి అని అధికారులను మంత్రి ఆదేశించారు.
9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులు..
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలన్నారు. మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులలో ఇప్పటివరకు ఆరు లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన దరఖాస్తులకు వచ్చే 15 రోజుల్లో నోటీసులు ఇవ్వాలని, ఆ తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన దరఖాస్తులను పరిష్కారించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం సాదాబైనామా అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటి పరిష్కారానికి 2020 ఆర్వోఆర్ చట్టంలో సరైన నిబంధనలు లేకపోవడం వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను సవరించి దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MLC Dasoju Sravan | ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
- ●Methuku Anand | ఇది పల్లీ బఠాణీల కేబినెట్లా మారింది
- ●Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!
- ●Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...
- ●Singareni | సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. రూ. కోటిన్నర వరకు బీమా రక్షణ
- ●Koppula Eshwar | అడ్లూరి.. నీ సవాల్ మాకు ఓకే.. టైమ్, డేట్ చెప్తే ఆధారాలతో వస్తం

MLC Dasoju Sravan | ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

Methuku Anand | ఇది పల్లీ బఠాణీల కేబినెట్లా మారింది

Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!

Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...




