KTR | రైతులను ఏడిపిస్తున్న సీఎంను ఎంత తిట్టినా తక్కువనే : కేటీఆర్
KTR | ఒకవైపు ఎరువుల కొరత, విత్తనాల కొరత, కరెంటు కోతలు, కొత్తగా రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్తు కుట్రలు, రైతుబంధు ఎగవేత, రైతుబీమా రద్దు ఇలా దుర్మార్గంగా రైతులను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రిని ఎంత తిట్టినా తక్కువనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : ఒకవైపు ఎరువుల కొరత, విత్తనాల కొరత, కరెంటు కోతలు, కొత్తగా రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్తు కుట్రలు, రైతుబంధు ఎగవేత, రైతుబీమా రద్దు ఇలా దుర్మార్గంగా రైతులను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రిని ఎంత తిట్టినా తక్కువనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈరోజు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలోకి వచ్చి ఇంటింటా సంక్షోభం నింపింది అన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న పంటల కొనుగోలు తాలూకు నిర్ణయం రాష్ట్ర రైతాంగానికి ఉరితాడుగా మారబోతుందని కేటీఆర్ అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఒకటే ఆవేదన ఆక్రందన కనిపిస్తోంది. పదేండ్ల తెలంగాణ రెండున్నర ఏండ్లలో సంక్షోభంలోకి జారుకున్నది. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే అన్ని వర్గాలను అడ్డగోలుగా మోసం చేస్తున్నది అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏం లబ్ధి జరిగింది, ఎన్ని కొత్త పథకాలు వచ్చాయి, ఎంత అభివృద్ధి జరిగింది అన్న విషయాన్ని రాష్ట్రంలోని ప్రజలంతా ఆలోచించాలన్నారు. గతంలో పంటలు పండించిన ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, మోడీ చెప్తేనే కొంటారా? మోదీ బ్రోకర్ల అంటూ రకరకాల అడ్డగోలు మాటలు మాట్లాడి, ఈ రోజు మోడీ చెబితేనే కొంటాను, మోడీ చెప్పినంతనే కొంటాను అంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని గమనించాలన్నారు. ఇకపై తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ కోటా మీరకే పండించిన ధాన్యం గింజలు కొంటామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే సీజన్ నుంచి రైతు అన్నలు పూర్తి సంక్షోభంలోకి కూరుకుపోతారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదు..
మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తాను, ప్రతి గింజను కొంటాను అని చెప్పి ఇప్పుడు మళ్లీ నాలుక మడతేసి తాను చెప్పిన తీస్మార్‌ఖాన్ డైలాగులు మర్చిపోయి బుడ్డర్‌ఖాన్ మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అన్నారు. ఆనాడు రైతుబంధు మేమెందుకు ఎగగొడతాం, దివానా గాల్లమా, మాకు జ్ఞానం లేదా? అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే రైతుబంధుతో పాటు రైతున్నల ఎరువును, కరెంట్ ను అన్నింటిని ఎగగొట్టే కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపైన మళ్లీ తిరగబడి కొట్లాడితేనే పరిస్థితులు మారుతాయని, అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం తన సిగ్గులేని, రైతు వ్యతిరేక పాలన కొనసాగిస్తూనే ఉంటుందని కేటీఆర్ అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు తరిమి కొడదామా అని ఎదురుచూస్తున్నారన్నారు. ఆ ఎదురుచూపులు ఫలించి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదు అని, ఇంకో ఏడాదిన్నర కాలం కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముగింపు పలకవచ్చు అన్నారు.
రేవంత్ రెడ్డి నోటి వెంట మాత్రం బూతుల బురద..
ఈరోజు రాష్ట్రంలో పథకాల వరద దేవుడెరుగు, రేవంత్ రెడ్డి నోటి వెంట మాత్రం బూతుల బురద వస్తున్నది. ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతూ కేసులు పెడుతున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎంతోమంది ముఖ్యమంత్రులను ప్రజలు చూశారు, కానీ రేవంత్ రెడ్డి మాదిరి నీచమైన మాటలు, బూతులు మాట్లాడే అసమర్థ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఎవరూ చూడలేదు అన్నారు.
కప్పం కడితేనే ఆయన పదవి రెన్యువల్
గత ఎన్నికల ప్రచారంలోనే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఢిల్లీ వాళ్ల చేతిలో పాలన పెడితే మన స్వతంత్రానికి నష్టం వాటిల్లుతుంది, ఢిల్లీ గద్దెకి సామంతులుగా మారిపోవాల్సి వస్తుందని. కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు పార్టీలు ఢిల్లీకి గులాములు మాత్రమే అయ్యారు. ముఖ్యమంత్రి 73 సార్లు ఢిల్లీకి పోయి 70 పైసలు కూడా తీసుకురాలేకపోయాడు. కానీ తెలంగాణ నుంచి మాత్రం నోట్ల కట్టలను ఢిల్లీలోని తమ హైకమాండ్‌కు పంపుకుంటున్నారు. ప్రతి నెలా రేవంత్ రెడ్డి కప్పం కడితేనే ఆయన పదవి రెన్యువల్ అవుతుందని అందరికీ తెలుసు. గత ప్రభుత్వ హయాంలో పేదవాడిని ప్రభుత్వం చూసుకుంటే, ఈ రోజు రేవంత్ రెడ్డి పెద్దవాళ్లను ఢిల్లీలోని తమ పార్టీ పెద్దలను చూసుకుంటూ కమీషన్లు దండుకుంటూ వారికి కప్పాలు కడుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...
- ●Singareni | సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. రూ. కోటిన్నర వరకు బీమా రక్షణ
- ●Koppula Eshwar | అడ్లూరి.. నీ సవాల్ మాకు ఓకే.. టైమ్, డేట్ చెప్తే ఆధారాలతో వస్తం
- ●India UAE Defence Deal | ఇండియన్ వెపన్స్‌పై కన్నేసిన యూఏఈ: 'బ్రహ్మోస్', 'ఆకాశ్ తీర్' కోసం ముమ్మర చర్చలు
- ●Shiv Sena UBT Split | ఉద్ధవ్ సేనకు షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు రెబల్ ఎంపీలు
- ●Rashmika Mandanna | అప్పుడు జాన్వీ - ఇప్పుడు రష్మిక - సేమ్ సీన్ రిపీట్

Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...

Singareni | సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. రూ. కోటిన్నర వరకు బీమా రక్షణ

Koppula Eshwar | అడ్లూరి.. నీ సవాల్ మాకు ఓకే.. టైమ్, డేట్ చెప్తే ఆధారాలతో వస్తం

India UAE Defence Deal | ఇండియన్ వెపన్స్‌పై కన్నేసిన యూఏఈ: 'బ్రహ్మోస్', 'ఆకాశ్ తీర్' కోసం ముమ్మర చర్చలు





