Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?
Vemula Veeresham | చెమటోడ్చి, రక్తం దారబోసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఎవరైనా తమ ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. తన బిడ్డ మాట్లాడిన మాటలను కేబినెట్ మంత్రిగా కొండా సురేఖ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
- లంపెన్‌లాగా, తాగుబోతుళ్లాగా బజార్లకొచ్చి మాట్లాడడం కాంగ్రెస్ కల్చర్ కాదు
- పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైన వాళ్లను బాధ్యతల నుంచి తప్పించాలే
- బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే లక్షలాది మంది ఆగ్రహానికి గురికాక తప్పదు
- కొండా కుటుంబానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరిక
Vemula Veeresham | త్రినేత్ర.న్యూస్: చెమటోడ్చి, రక్తం దారబోసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఎవరైనా తమ ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. తన బిడ్డ మాట్లాడిన మాటలను కేబినెట్ మంత్రిగా కొండా సురేఖ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆ బాధ్యత ఆమెపై లేదా అని నిలదీశారు. పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైన వాళ్లను పార్టీని నుంచి, పదవి బాధ్యతల నుంచి తప్పించాలని సీఎంను కోరారు. కొండా కుటుంబ సభ్యులు బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే లక్షలాది మంది ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొండా ఫ్యామిలీ భాషపై ఫైరయ్యారు.
ప్రతిపక్షాలకు గొంతునివ్వడమే..
సీఎం నిర్ణయాన్ని తప్పువట్టడం సరికాదు. అటువంటి వారు పార్టీలో ఉండే నైతిక హక్కు లేదు. చెట్టు కింద ఉంటూ చెట్టు కొమ్మనే నరుక్కునే వైఖరి మంచిది కాదు. ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేం భావిస్తున్నం. కొండా సురేఖగారు క్రమశిక్షణ నోటీసుకు సమాధానమిస్తూ సంబంధం లేదని చెప్పారు. మరి నీ బిడ్డ మాట్లాడిన మాటలను ఎందుకు ఖండించలేదు? నువ్ కేబినెట్ మంత్రిగా ఖండించాల్సిన బాధ్యత నీపై లేదా?
మీరు చేస్తున్న తప్పులకు, మీరు మాట్లాడుతున్న తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నరు. కానీ మీరు ఎంజాయ్ చేస్తూ, ఎంటర్‌టైన్‌గా ఫీలవుతూ ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నరు. ఏ విషయంలో మాట్లాడిన మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది. పార్టీకి నష్టదాయకంగానే ఉంది.
అందుకే టీపీసీసీ గానీ, ఏఐసీసీ గానీ కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేమంతా సీఎల్పీ కార్యాలయానికి వచ్చి మాట్లాడుతున్నం. మేమందరం ఒకటే కోరుతున్నం. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్ ఎంతో చమటోడ్చారు. రక్తం దారబోశారు. వారికి తోడుగా వారి బ్రదర్స్ చెమటోడ్చిన విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ పనిగట్టుకొని ప్రతిపక్షాలు వారిని వీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. సీఎంను వీక్ చేయాలనే దుర్మార్గమైన వైఖరితో ఉన్నరు.
పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైన వ్యక్తులను బాధ్యతల నుంచి తప్పించాలని మేం సీఎంను డిమాండ్ చేస్తున్నం. ఏదున్నా పార్టీ వేదికలల్లో మాట్లాడుకోవాలి. సంబంధించిన మీటింగలల్లో డిస్కషన్ చేయాలి. ఏ వేదికల అవకాశం వస్తే అక్కడ మాట్లాడాలే. స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ బజాట్లో చాయ్ దొరికితే ఊగిపోయే నేచర్‌ను ఎవరు ప్రదర్శించినా అది పార్టీ నియమాలకు విరుద్దం. సీఎంపై పార్టీలో ఉన్న ఎవరైనా అసత్య రీతిలో మాట్లాడినా.. ఏకవాక్యంతో మాట్లాడినా మేం చూస్తూ ఊరుకోం.
ఇలాంటి లంపెన్ కల్చర్ ఎక్కడా లేదు..
వీళ్ల భాష మూలంగా కార్యకర్తల్లో, ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు వస్తున్నాయి. 10 ఏండ్లు దొంగల పాలైన రాష్ట్రాన్ని ప్రజల వశం చేసిన ముఖ్యమంత్రి ఒక విజన్‌తో ముందుకు పోతా ఉంటే ఇయ్యాళ మాట్లాడే భాష మంచిది కాదని చెబుతున్నాం. పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే ఇంతకంటే లంపెన్ కల్చర్ ఎక్కడా ఉండదు.
అది బజారు కల్చర్..
రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువలను, పద్ధతులను పాటించాలి. గౌరవాన్ని కాపాడుకోవాలే. కానీ ఒక లంపెన్‌లాగా, తాగుబోతుళ్లాగా బజార్లకొచ్చి మాట్లాడడం అంటేనే అది బజారు కల్చర్, బజారు సంస్కృతి అయితది తప్పా కాంగ్రెస్ కల్చర్, కాంగ్రెస్ సంస్కృతి కాదు. ఇప్పటివరకు మాట్లాడిన మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలే. ఒకవేళ చెప్పకుంటే లక్షలాది మంది ఆగ్రహానికి గురికాక తప్పదు అని వేముల వీరేశం హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్
ఆగస్టు 20, 2026

Kalyana Lakshmi | పెళ్లై పిల్లలు కూడా పుట్టారు.. ఇంకా కళ్యాణలక్ష్మీ చెక్ రాలేదు
ఆగస్టు 20, 2026

Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?
- ●Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..
- ●EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా

‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?

Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..

Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు



