త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మ‌ధ్య గొడ‌వ‌.. 14 మంది స‌స్పెండ్‌.. ఉప‌సంహ‌రించుకోవాలంటూ విద్యార్థుల ధ‌ర్నా

EFLU | హైద‌రాబాద్ తార్నాకలోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివ‌ర్సిటీ (EFLU)లో రెండు విద్యార్థి సంఘాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్నది. దీంతో వ‌ర్సిటీ అధికారులు 14 మంది విద్యార్థుల‌ను స‌స్పెండ్ (Suspension) చేశారు. ఇందులో ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ నుంచి ఏడుగురు చొప్పున విద్యార్థులు ఉన్నారు.

G

Hyderabad | Published On Aug 21, 2026, 10.00 am IST

EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మ‌ధ్య గొడ‌వ‌.. 14 మంది స‌స్పెండ్‌.. ఉప‌సంహ‌రించుకోవాలంటూ విద్యార్థుల ధ‌ర్నా
Advertisement

EFLU | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ తార్నాకలోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివ‌ర్సిటీ (EFLU)లో రెండు విద్యార్థి సంఘాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్నది. దీంతో వ‌ర్సిటీ అధికారులు 14 మంది విద్యార్థుల‌ను స‌స్పెండ్ (Suspension) చేశారు. ఇందులో ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ నుంచి ఏడుగురు చొప్పున విద్యార్థులు ఉన్నారు. వ‌ర్సిటీ క‌మిటీ చేప‌ట్టిన విచార‌ణ పూర్త‌య్యేవ‌ర‌కు ఆ విద్యార్థులు హాస్ట‌ల్ ఖాళీ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఇఫ్లూ విద్యార్థి సంఘం, ఎన్ఎస్‌యూఐ (NSUI), ఇత‌ర సంస్థ‌ల కార్య‌క‌ర్త‌లు ఎన్ఎస్‌యూఐ స‌భ్యుల‌పై స‌స్పెన్ష‌న్ ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చూస్తే గురువారం రాత్రి పొద్దుపోయేవ‌ర‌కు వ‌ర్సిటీలో ధ‌ర్న నిర్వ‌హించారు. బాధితుపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఏంట‌ని వ‌ర్సిటీ ఆధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

దీంతో అధికారులు విద్యార్థి సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి స‌స్పెన్ష‌న్‌ను ఉప‌సంహ‌రించుకుంటామ‌ని, స్వ‌తంత్రంగా విచార‌ణ నిర్వ‌హిస్తామ‌ని మౌఖికంగా హామీ ఇచ్చారు. విచార‌ణ త‌ర్వాత త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో శాంతించిన‌ విద్యార్థులు ధ‌ర్నాను విర‌మించారు.

అస‌లేం జ‌రిగిందంటే..

ఈ నెల 13న ఇద్దరు విద్యార్థినులకు ఒకే గదిని కేటాయించకపోవడంపై ఓ విద్యార్థి సంఘం ప్రతినిధులు ధర్నాకు దిగారు. వారికి మరో సంఘం ప్రతినిధులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగిందన్నారు. 14న తెల్లవారుజామున మరో సంఘానికి చెందిన కొందరు విద్యార్థులు.. ప్రత్యర్థి వర్గానికి చెందిన విద్యార్థుల గదుల్లోకి చొరబడి కర్రలు, రాడ్లతో దాడి (Violent Clash) చేశారు. ప్రతిగా బాధితులూ ఎదురుదాడికి దిగడంతో.. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరువర్గాలపై సెక్షన్లు 147, 148, 149 కింద ఓయూ పోలీసులు కేసులు నమోదు చేశారు. తలలు పగిలేలా దాడిచేసిన ఏడుగురు విద్యార్థులపై బీఎన్‌ఎస్‌ 326 సెక్షన్‌ నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. మిగతావారిని బెయిల్‌పై విడుద‌ల చేశారు. ఈ నేప‌థ్యంలో బాధితుల‌పై కూడా వ‌ర్సిటీ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప‌ల్ల ఏబీవీపీ (ABVP) మిన‌హా ఇత‌ర విద్యార్థి సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి.

Advertisement
Advertisement