త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అగ‌మ్య‌గోచ‌రంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భ‌విత‌వ్యం : కేటీఆర్

KTR | రేవంత్ స‌ర్కార్ జారీ చేసిన జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

S

Telangana | Published On Aug 20, 2026, 7.38 pm IST

KTR | అగ‌మ్య‌గోచ‌రంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భ‌విత‌వ్యం : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ స‌ర్కార్ జారీ చేసిన జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

శాంతియుతంగా నిరసనను తెలుపుతున్న విద్యార్థుల మీద కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు నన్ను కలచివేశాయి. విద్యార్థుల హక్కులను కాలరాయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా... కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 97ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఇకముందు కూడా పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement