Vemula Prashanth Reddy | జూపల్లి వస్తడేమోనని టీవీల్లో చూశా.. కానీ పత్తకు రాలే
Vemula Prashanth Reddy | నిన్న తెలంగాణ భవన్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తడేమోనని కేటీఆర్, హరీష్ రావు ఎదురుచూశారని.. వస్తడేమో అని నేను కూడా టీవీల్లో చూశానని.. కానీ పత్తకు రాలేడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. సవాల్ చేసిన కాంగ్రెస్ మంత్రులు పోలీసులను అడ్డంపెట్టుకొని పారిపోయారన్నారు.
- నిన్ననే కాంగ్రెస్ డొల్లతనం బయటపడింది
- సవాల్ చేసిన మంత్రులు పోలీసుల అండతో పారిపోయారు
- సీఎం సీరియస్ అయితే ప్రెస్‌మీట్‌లు పెట్టి కవరేజీ ఇస్తున్నరు
- సై సినిమాలో వేణుమాధవ్‌కు పట్టిన గతే రేవంత్‌కు పట్టింది
- రేవంత్ డిఫెన్స్‌లో పడితే బండి తెరపైకి వస్తడు
- మీడియా సమావేశంలో కాంగ్రెస్‌పై మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శలు
Vemula Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్: నిన్న తెలంగాణ భవన్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తడేమోనని కేటీఆర్, హరీష్ రావు ఎదురుచూశారని.. వస్తడేమో అని నేను కూడా టీవీల్లో చూశానని.. కానీ పత్తకు రాలేడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. దాంతోనే కాంగ్రెస్ మంత్రుల డొల్లతనమేందో బయటపడిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా నాయకులపై సవాల్ విసిరితే మంత్రి జూపల్లి మధ్యలో దూరాడని ఎద్దేవా చేశారు. సవాల్ చేసిన కాంగ్రెస్ మంత్రులు పోలీసులను అడ్డంపెట్టుకొని పారిపోయారన్నారు. ఈమేరకు ఆయన తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ పేషెంట్ డెడ్ అయింది..
సై సినిమాలో వేణుమాధవ్‌కు ఏ గతి అయితే పట్టిందో అదే గతి నిన్న రేవంత్ రెడ్డికి పట్టింది. ఆపరేషన్ సక్సెస్.. కాంగ్రెస్ పేషెంట్ డెడ్ అయింది. గతంలో సవాల్ చేసిన రేవంత్ రెడ్డి ప్రెస్ క్లబ్‌ను కల్లు కాంపౌండ్‌తో పోల్చి పారిపోయారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్.. మూడు నెలల్లోనే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేశాడు. సవాల్ విసరడం, పారిపోవడం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య. రేవంత్‌లానే మంత్రులు నిన్న సవాల్ చేసి తోక ముడిచి పారిపోయారు. చారాణ కోడికి భారాణ మసాలా అన్నట్లు శిల్ప కళావేదికలో రేవంత్ రెడ్డి సభ పెట్టుకున్నాడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
మంత్రులపై రేవంత్ కోపమైండట..
నిన్నటి కేబినెట్‌లో మంత్రులపై సీఎం సీరియస్ అయ్యారని తెలిసింది. సవాల్ చేసి తోక ఎందుకు ముడిచారని మంత్రులపై రేవంత్ సీరియస్ కాగానే మంత్రులు ప్రెస్‌మీట్‌లు పెట్టి కవరేజ్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి డిఫెన్స్‌లో పడగానే బండి సంజయ్ తెరపైకి వస్తాడు. బండి సంజయ్ డిఫెన్స్‌లో పడగానే రేవంత్ తెరపైకి వస్తాడు. ఏదైనా ఇష్యూ వస్తే విచారణ చేసి చర్య తీసుకునే అధికారం బండి సంజయ్‌కు ఉంది. అమృత్ టెండర్‌లో ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి కుంభకోణంపై కేంద్రానికి లేఖ రాస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదు. బొగ్గు కుంభకోణం జరిగిందని కేంద్రానికి లేఖ రాస్తే ఇంతవరకు చర్యలే లేవు అని ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు.
హరీశ్‌రావు, కేటీఆర్ వాయింపు ఫలితమే ఇది..
బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు.. బాధ్యతయుతంగా ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిని కాపడడమే బండి సంజయ్ పనిగా పెట్టుకున్నారు. సింగరేణిలో బొగ్గు మాయంపై మంత్రి భట్టి విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. కేటీఆర్, హరీష్ రావుల వాయింపు ఫలితమే ఇదంతా. కేటీఆర్, హరీష్ సెగకు మంత్రులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇక ముందు ఇలాంటివి చాలా జరుగుతాయి అని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రవీణ్ కుమార్‌పై అహంకారంతో మాట్లాడుతున్నరు..
వీఆర్ఎస్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల టెండర్లలో కుంభకోణం బయటపెట్టాడు. ఉద్యమం జరిగినప్పుడు గుర్తురాని గన్‌పార్క్ కాంగ్రెస్ మంత్రులకు ఇప్పుడు గుర్తొచ్చింది. తాడు బొంగరం లేని వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారు. గురుకుల టెండర్‌లో టెస్కో ఇవ్వమని కొండా సురేఖ లేఖ రాస్తే పట్టించుకోలేదు. మా పార్టీ సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ శాసనసభ ఉప నాయకుడు హరీష్ రావును అరెస్ట్ చేసి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. గన్‌పార్క్ వద్దకు వెళ్తున్న కేటీఆర్‌ను తెలంగాణ భవన్ ముందు అడ్డుకున్నారు. అధికారాన్ని, పోలీసులను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష నాయకులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నరు. ప్రభుత్వం దగ్గర సమాధానం లేనప్పుడే ఇలాంటి అరెస్టులకు పాల్పడతారు అని వేముల ఫైరయ్యారు.

ఈ ప్రెస్‌మీట్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె. కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నేత గౌతు ప్రసాద్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Arvind Kejriwal | ప్రధానికి తెలియకుండా ఇది అసాధ్యం.. రామాలయ విరాళాల దుర్వినియోగంపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
జులై 3, 2026

Garmin | గార్మిన్ కొత్త ఫోర్రన్నర్ సిరీస్.. ఏఐ ట్రైనింగ్, మ్యూజిక్‌తో మూడు స్మార్ట్‌వాచ్‌లు లాంచ్..
జులై 3, 2026

RS Praveen Kumar | అడ్లూరి గారు.. మీరు రాజీనామా చేయొద్దు.. వీరి బాధలు వినండి చాలు
జులై 3, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | అడ్లూరి గారు.. మీరు రాజీనామా చేయొద్దు.. వీరి బాధలు వినండి చాలు
- ●Aaya Sher Song | 200 మిలియన్ల వ్యూస్ - యూట్యూబ్‌లో నాని ఆయా షేర్ సాంగ్ రికార్డ్ - దుమ్మురేపుతున్న తెలంగాణ పాట
- ●Transgender Scholarship | ట్రాన్స్జెండర్లకు శుభవార్త.. ఒకేసారి రూ. 40 వేలు చెల్లింపు
- ●Madrasa Teacher | పోక్సో కేసు.. మదర్సా టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
- ●Stock Markets | మూడో రోజూ దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, ఫార్మా షేర్లలో జోష్..
- ●Modi New Zealand Visit | వచ్చే వారం న్యూజిలాండ్‌కు మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది..!

RS Praveen Kumar | అడ్లూరి గారు.. మీరు రాజీనామా చేయొద్దు.. వీరి బాధలు వినండి చాలు

Aaya Sher Song | 200 మిలియన్ల వ్యూస్ - యూట్యూబ్‌లో నాని ఆయా షేర్ సాంగ్ రికార్డ్ - దుమ్మురేపుతున్న తెలంగాణ పాట

Transgender Scholarship | ట్రాన్స్జెండర్లకు శుభవార్త.. ఒకేసారి రూ. 40 వేలు చెల్లింపు

Madrasa Teacher | పోక్సో కేసు.. మదర్సా టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష



