MLC Tata Madhu | నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా: ఎమ్మెల్సీ తాతా మధు
MLC Tata Madhu | తాను అనని మాటలను నాకు ఆపాదిస్తున్నారని.. ఒకవేళ స్పీకర్‌ను ఉద్దేశించి అన్నట్లు భావిస్తే ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
- స్పీకర్ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది
- ఎమ్మెల్యేల దాడిని పక్కదారి పట్టించేందుకే నా మాటలను వక్రీకరిస్తున్నారు
- మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు
MLC Tata Madhu | త్రినేత్ర.న్యూస్: తాను అనని మాటలను నాకు ఆపాదిస్తున్నారని.. ఒకవేళ స్పీకర్‌ను ఉద్దేశించి అన్నట్లు భావిస్తే ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. స్పీకర్ వ్యవస్థ పట్ల, స్పీకర్‌పై వ్యక్తగతంగా తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. వారిని ఉద్దేశించి ఒక్కమాట కూడా అనలేదన్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
నేను అనని మాటలను నాకు ఆపాదిస్తున్నారు. ఈ విషయంపై వివరణ ఇస్తున్నాను. స్పీకర్ వ్యవస్థ పట్ల, వ్యక్తిగతంగా స్పీకర్ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. వారిని ఉద్దేశించి నేను ఒక్క మాట కూడా అనలేదు. నేను అనని మాటలను నాకు ఆపాదించడం సరైంది కాదు. ఒకవేళ నేను అన్న మాటల్లో ఏదైనా స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే ఆ మాటలను నేను ఉపసంహరించుకుంటున్నా. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా.
ఈరోజు మహిళా ఎమ్మెల్యేలతో పాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడి జరిగింది. నాపై కూడా దాడి చేసి నా ప్యాంటు ఊడదీసేందుకు ప్రయత్నించారు. నా గొంతు నొక్కడానికి యత్నించారు. చెప్పడానికి వీలుకాని రీతిలో బండబూతులు తిడుతూ నా డొక్కలో పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారు. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యాను. దాడి ఎవరు చేశారు? నా ప్యాంటు లాగేందుకు ఎవరు యత్నించారు? అలా చేయమని ఎవరు ఆదేశించారు? అంటూ ఆవేదన వ్యక్తం చేశాను. ఆ సమయంలో కూడా నేను స్పీకర్ గారిని అనలేదు.
శాంతియుతంగా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మగ పోలీసులు మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగడం, జట్టు పట్టుకోవడం, గొంతు నొక్కడం వంటి ఘటనలు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయి. యాదవరెడ్డి, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్, డాక్టర్ సంజయ్ గార్లపై పోలీసులు దాడి చేసి ఈడ్చుకెళ్లారు.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. దాడికి పాల్పడిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలి. నా మాటలను వక్రీకరించి అసలు ఘటనను పక్కదారి పట్టించకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకొని చర్యలు తీసుకోవాలి అని తాతా మధు విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు

ఆపరేషన్ ‘కౌంటర్ ఫోర్ట్రెస్’: కేసీఆర్ పాత వ్యూహాన్నే రివర్స్ చేస్తున్నారా రేవంత్?
సెప్టెంబర్ 7, 2026

MP Chamala Kirankumar | తాతా మధును సస్పెండ్ చేయాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ డిమాండ్
సెప్టెంబర్ 7, 2026

Devani Sathish Madiga | రేపు 1000 డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం: దేవని సతీష్ మాదిగ
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●SC ST Commission Telangana | అసెంబ్లీ వద్ద దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
- ●Deepa Jewellers IPO | దీపా జ్యువెలర్స్ షేర్లు రేపే లిస్టింగ్.. ఐపీవోకు అదిరిపోయే స్పందన..
- ●ఆపరేషన్ ‘కౌంటర్ ఫోర్ట్రెస్’: కేసీఆర్ పాత వ్యూహాన్నే రివర్స్ చేస్తున్నారా రేవంత్?
- ●Raashi Khanna | బ్లాక్ ఔట్ఫిట్లో రాశీ ఖన్నా.. గ్లామర్‌తో అదరగొట్టేసిందిగా!
- ●AIIMS Delhi Population Counter | క్షణక్షణం.. లైవ్‌లో దేశ జనాభా.. రోడ్డుపై డిజిటల్ బోర్డు ఏర్పాటు
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్నవారికి ఊరట..

SC ST Commission Telangana | అసెంబ్లీ వద్ద దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

Deepa Jewellers IPO | దీపా జ్యువెలర్స్ షేర్లు రేపే లిస్టింగ్.. ఐపీవోకు అదిరిపోయే స్పందన..

ఆపరేషన్ ‘కౌంటర్ ఫోర్ట్రెస్’: కేసీఆర్ పాత వ్యూహాన్నే రివర్స్ చేస్తున్నారా రేవంత్?

Raashi Khanna | బ్లాక్ ఔట్ఫిట్లో రాశీ ఖన్నా.. గ్లామర్‌తో అదరగొట్టేసిందిగా!




