Devani Sathish Madiga | రేపు 1000 డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం: దేవని సతీష్ మాదిగ
Devani Sathish Madiga | దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సోమవారం చేసిన వ్యాఖ్యలు అమానుషమని టీపీసీసీ సీనియర్ నాయకులు దేవని సతీష్ మాదిగ అన్నారు. నిన్న ఫామ్‌హౌస్‌కు పిలిపించుకొని కేసీఆర్ ఉసిగొల్పి పంపారని ఆరోపించారు.
Devani Sathish Madiga | త్రినేత్ర.న్యూస్: దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సోమవారం చేసిన వ్యాఖ్యలు అమానుషమని టీపీసీసీ సీనియర్ నాయకులు దేవని సతీష్ మాదిగ అన్నారు. నిన్న ఫామ్‌హౌస్‌కు పిలిపించుకొని కేసీఆర్ ఉసిగొల్పి పంపారని ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ రేపు 1000 డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దళిత, దండోర, మాల మహానాడు సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నేతలందరూ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈమేరకు తాతా మధు వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిన్న ఎర్రవలిలోని ఫామ్‌హౌస్‌కు పిలిపించుకొన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం సృష్టించండని, వచ్చిన పోలీసులను కొట్టండని వారికి చెప్పారు. నల్ల టీ షర్ట్స్ వేసుకొని అసెంబ్లీలో అల్లర్లు సృష్టించండి.. అసెంబ్లీని సజావుగా జరగకుండా చూడాలి అని కేసీఆర్ కుట్ర పన్ని దొంగల్లాగా లూటీ మాఫీ చేసే వ్యక్తుల్లాగా అసెంబ్లీ మీద దాడి చేయించాడు. అసెంబ్లీ ఆవరణలో పోలీసుల మీద దాడులు చేస్తూ బీభత్సం సృష్టించారు అని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రెడ్డి స్పీకర్‌ను దృష్టిలో పెట్టుకొని చెప్పలేని భాషలో మాట్లాడారు. స్పీకర్ గాడు అని సంబోధించాడు. ఇతని మీద వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ముసలి గుంట నక్క కేసీఆర్ అంతు చూడడానికి 1000 డప్పులతో ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌ను ముట్టడి చేస్తాం. ఇది దళితులకు, అగ్రకుల దొరహంకారానికి జరుగుతున్న యుద్ధం. అందరూ రావాలి అని సతీష్ మాదిగ విజ్ఞప్తి చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●SC ST Commission Telangana | అసెంబ్లీ వద్ద దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
- ●MLC Tata Madhu | నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా: ఎమ్మెల్సీ తాతా మధు
- ●Deepa Jewellers IPO | దీపా జ్యువెలర్స్ షేర్లు రేపే లిస్టింగ్.. ఐపీవోకు అదిరిపోయే స్పందన..
- ●ఆపరేషన్ ‘కౌంటర్ ఫోర్ట్రెస్’: కేసీఆర్ పాత వ్యూహాన్నే రివర్స్ చేస్తున్నారా రేవంత్?
- ●Raashi Khanna | బ్లాక్ ఔట్ఫిట్లో రాశీ ఖన్నా.. గ్లామర్‌తో అదరగొట్టేసిందిగా!
- ●AIIMS Delhi Population Counter | క్షణక్షణం.. లైవ్‌లో దేశ జనాభా.. రోడ్డుపై డిజిటల్ బోర్డు ఏర్పాటు

SC ST Commission Telangana | అసెంబ్లీ వద్ద దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

MLC Tata Madhu | నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా: ఎమ్మెల్సీ తాతా మధు

Deepa Jewellers IPO | దీపా జ్యువెలర్స్ షేర్లు రేపే లిస్టింగ్.. ఐపీవోకు అదిరిపోయే స్పందన..

ఆపరేషన్ ‘కౌంటర్ ఫోర్ట్రెస్’: కేసీఆర్ పాత వ్యూహాన్నే రివర్స్ చేస్తున్నారా రేవంత్?




