HYDRAA | అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
HYDRAA | అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంబంధిత శాఖలతో ఇప్పటికే వరుస సమావేశాలు జరిగాయి.
HYDRAA | త్రినేత్ర.న్యూస్ : అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంబంధిత శాఖలతో ఇప్పటికే వరుస సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు, నియమనిబంధనల ప్రకారం హైడ్రా తదుపరి చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
గురువారం అమీర్‌పేట, మైత్రివనం పరిసరాల్లోని వెస్ట్ శ్రీనివాసనగర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన షాపింగ్ కాంప్లెక్స్‌ను శుక్రవారం హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అగ్ని ప్రమాదాలకు గల కారణాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. పురాతన విద్యుత్ వైరింగ్, సామర్థ్యానికి మించి కరెంటు వినియోగం వల్ల తరచూ షార్ట్ సర్క్యూట్స్ ఏర్పడి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గురువారం అమీర్‌పేటలో జరిగిన అగ్ని ప్రమాదానికి పక్కనే ఉన్న మెస్‌కు సంబంధించి చిమ్నీల ద్వారా నిప్పురవ్వలు పడడంతో జరిగిందని.. మరోవైపు షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. ఈ విషయమై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందన్నారు.

ఇలా జరుగుతున్న అగ్ని ప్రమాదాలను నియంత్రించాలనే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎన్‌వోసీల జారీ, తనిఖీలు, నిబంధనలు పాటించని వారిపై చర్యలు.. ఇలా చాలా మార్పులు రానున్నాయని హైడ్రా కమిషనర్ తెలిపారు. నగరంలో చాలా వరకు భవనాలు, దుకాణ సముదాయాలకు ఫైర్ ఎన్‌వోసీలు లేవని.. చెక్ చేసి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ చెప్పారు. వరద కాలువలపై నిర్మాణాల విషయంలో కూడా.. ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్యతో పాటు.. ఆర్ఎఫ్‌వో జయప్రకాష్, ఎస్ఎఫ్‌వోలు ఈ పరిశీలనలో ఉన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న హత్యలు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ఫైర్
జూన్ 5, 2026

BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జూన్ 5, 2026

CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Himalayan Water Mills | కరెంట్ వద్దు, ఇంధనం అసలే వద్దు: శతాబ్దాలుగా నీటి ప్రవాహంతోనే నడుస్తున్న హిమాలయాల 'మర గిర్నీలు'
- ●RS Praveen Kumar | హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న హత్యలు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ఫైర్
- ●BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- ●PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ
- ●Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు
- ●Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - వీటిని మిస్సవ్వొద్దు...

Himalayan Water Mills | కరెంట్ వద్దు, ఇంధనం అసలే వద్దు: శతాబ్దాలుగా నీటి ప్రవాహంతోనే నడుస్తున్న హిమాలయాల 'మర గిర్నీలు'

RS Praveen Kumar | హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న హత్యలు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ఫైర్

BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ



