ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ABVP Protest | కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు బోర్డ్ అనుమతి కోసం ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయని ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రెటరీ పృథ్వి తేజ ఆరోపించారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఇంకా ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నాయో ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించాలని డిమాండ్ చేశారు.
- ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రెటరీ పృథ్వి తేజ డిమాండ్
ABVP Protest | త్రినేత్ర.న్యూస్: కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు బోర్డ్ అనుమతి కోసం ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయని ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రెటరీ పృథ్వి తేజ ఆరోపించారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఇంకా ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నాయో ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించాలని డిమాండ్ చేశారు. దొడ్డి దారిన ఫేక్ NOCలు సమర్పించిన కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం ఇంటర్మీడియట్ బోర్డ్ ముట్టడించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తేజ మాట్లాడారు. నగరంలో అనేక కళాశాలల్లో ఎటువంటి ఫైర్ సేఫ్టీ, ప్లే గ్రౌండ్ లేని, శిథిలావస్థలో ఉన్న భవనాలలో నడుపుతున్నారన్నారు. బోర్డు నుంచి అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. వెంటనే ఫోర్జరీకి పాల్పడిన కళాశాలల గుర్తింపును రద్దు చేసి, భారీ జరిమానాలు విధించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో పటిష్టమైన తనిఖీలు చేపట్టి అక్రమాలను వెలికితీసి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఏబీవీపీ కార్యకర్తలే అక్రమాలకు పాల్పడిన కళాశాలల భరతం పడతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరి ప్రసాద్, కోటి జిల్లా కన్వీనర్ రేవంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజన్, నగర కార్యదర్శి సురేందర్, రిషింద్ర, మణిదీప్, రాహుల్, సచిన్, సాయికిరణ్, విష్ణు, శివ, జశ్వంత్, రఘునందన్, రాంప్రసాద్, రాహుల్, శివ ప్రసాద్, పి.శివ, కురుమూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Priyanka Chopra | ఆస్కార్ విన్నింగ్ యాక్టర్‌తో గ్లోబల్ స్టార్ రొమాన్స్ - హాలీవుడ్లో జాక్‌పాట్
- ●Krishank | ఇందిరమ్మ చీరలను ఎలుకలు కొరుకుతున్నయ్.. 10 నెలల నుంచి ఎందుకు పంచలే?
- ●Niranjan Reddy | ఉన్న నీళ్లను వదిలిపెట్టి వరుణ యాగమా..?
- ●Kangana Ranaut | యువతే దేశానికి బలమైన శక్తి.. జెన్‌జీ విషయంలో స్వరం మార్చిన కంగన
- ●Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత
- ●Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Priyanka Chopra | ఆస్కార్ విన్నింగ్ యాక్టర్‌తో గ్లోబల్ స్టార్ రొమాన్స్ - హాలీవుడ్లో జాక్‌పాట్

Krishank | ఇందిరమ్మ చీరలను ఎలుకలు కొరుకుతున్నయ్.. 10 నెలల నుంచి ఎందుకు పంచలే?

Niranjan Reddy | ఉన్న నీళ్లను వదిలిపెట్టి వరుణ యాగమా..?

Kangana Ranaut | యువతే దేశానికి బలమైన శక్తి.. జెన్‌జీ విషయంలో స్వరం మార్చిన కంగన



