Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లకు భారీ షాక్, రూ.2 లక్షల కోట్లు ఆవిరి..
Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మధ్య తాజాగా మళ్లీ ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లో ముగిశాయి. ఉదయం సెషన్‌లో లాభాలతో సూచీలు మొదలైనప్పటికీ మధ్యప్రాచ్యంలో మళ్లీ నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది.
Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మధ్య తాజాగా మళ్లీ ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లో ముగిశాయి. ఉదయం సెషన్‌లో లాభాలతో సూచీలు మొదలైనప్పటికీ మధ్యప్రాచ్యంలో మళ్లీ నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో వారు భారీ ఎత్తున అమ్మకాలు కొనసాగించారు. మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగియగా, నాలుగు వరుస సెషన్‌లలో వచ్చిన ర్యాలీకి బ్రేక్ పడింది. ముడి చమురు ధరలు పెరగడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా మారింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్లు (0.13 శాతం) పడిపోయి 78,180.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 32 పాయింట్లు (0.13 శాతం) క్షీణించి 24,398.70 వద్ద స్థిరపడింది.
భారీగా పెరిగిన చమురు ధరలు..
పెద్ద కంపెనీలతోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.30 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.55 శాతం నష్టంతో ముగిశాయి. మార్కెట్ పతనం కారణంగా బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.482.3 లక్షల కోట్ల నుంచి రూ.480 లక్షల కోట్ల కన్నా దిగువకు పడిపోయింది. దీంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మంగళవారం చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 1.49 శాతం మేర ఎగసి బ్యారెల్‌కు 72 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.29 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 69 డాలర్లకు వచ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో మాత్రం పాజిటివ్ సంకేతం వచ్చింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 41 పైసలు లాభపడ్డ రూపాయి 94.96 వద్ద నిలిచింది.
వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు..
అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలే మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇన్వెస్టెర్లు రిస్క్ తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఇప్పటికే వరుసగా నాలుగు సెషన్లలో మార్కెట్లు ర్యాలీని కొనసాగించడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపారు. ఇది కూడా మార్కెట్లు నష్టాల్లో ముగియడానికి కారణమైంది. ఇక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిందన్న వార్తలతో ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో ముగిశాయి. జపాన్ నిక్కీ225 సూచీ 2 శాతం పతనమవ్వగా, దక్షిణ కొరియా కోస్పి సూచీ 4.91 శాతం మేర పడిపోయింది. షాంగై కంపోజిట్ 1.26 శాతం, హాంగ్ సెంగ్ సూచీ 0.51 శాతం చొప్పున నష్టపోయాయి.
ట్రంప్ హెచ్చరికలు..
ఇరాన్‌పై అమెరికా ఇంకా దాడులు కొనసాగించే అవకాశం ఉందన్న వార్తలతో మార్కెట్లలో ప్రతికూల సెంటిమెంట్ నెలకొంది. దీంతో దాదాపు అన్ని దేశాలకు చెందిన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌పై దాడులను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదురుతుందని, లేదంటే పని పూర్తి చేస్తామని హెచ్చరించారు. అయితే మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుందన్న పాజిటివ్ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..
జులై 7, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ జోష్.. కొనసాగుతున్న బుల్ ర్యాలీ..
జులై 6, 2026

SEBI | సెబీ కీలక నిర్ణయం.. ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..
జులై 6, 2026
తాజావార్తలు
- ●HCU Admissions | హెచ్‌సీయూలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ●E20 Petrol | E20 పెట్రోల్‌పై భయాలు అవసరం లేదు.. ఆటోమొబైల్ నిపుణుడి కీలక వ్యాఖ్యలు..
- ●RS Praveen Kumar | భూ భారతి పోర్టల్ దొంగలు రేవంత్, పొంగులేటే
- ●E20 fuel | E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవదని లిఖితపూర్వక హామీ ఇవ్వండి.. వాహన తయారీ సంస్థలను కోరిన కేజ్రీవాల్
- ●Pune Ketan Agarwal Death Case | కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్: కాబోయే భర్తను చంపకముందే ప్రియుడిని పెళ్లాడిన సియా!
- ●Sanju Samson | 12 బంతుల్లోనే నమ్మకం పోయిందా? ప్రపంచకప్ హీరో శాంసన్‌ను పక్కన పెట్టేశారా?

HCU Admissions | హెచ్‌సీయూలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

E20 Petrol | E20 పెట్రోల్‌పై భయాలు అవసరం లేదు.. ఆటోమొబైల్ నిపుణుడి కీలక వ్యాఖ్యలు..

RS Praveen Kumar | భూ భారతి పోర్టల్ దొంగలు రేవంత్, పొంగులేటే

E20 fuel | E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవదని లిఖితపూర్వక హామీ ఇవ్వండి.. వాహన తయారీ సంస్థలను కోరిన కేజ్రీవాల్



