త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kajal Aggarwal | ఓ వైపు షూటింగ్‌…మ‌రోవైపు ప్ర‌మోష‌న్స్ – కాజ‌ల్ అగ‌ర్వాల్ డ‌బుల్ డ్యూటీ

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ బ్రేక్ లేకుండా తెగ క‌ష్ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని షూటింగ్‌లో పాల్గొంటుంది ఈ బ్యూటీ. మ‌రోవైపు ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లోనే త‌న అప్‌క‌మింగ్ మూవీ ది ఇండియా స్టోరీని ప్ర‌మోట్ చేస్తోంది. కాజ‌ల్ డ‌బుల్ డ్యూటీపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

N

Entertainment | Published On Jul 7, 2026, 4.26 pm IST

Kajal Aggarwal | ఓ వైపు షూటింగ్‌…మ‌రోవైపు ప్ర‌మోష‌న్స్ – కాజ‌ల్ అగ‌ర్వాల్ డ‌బుల్ డ్యూటీ
Advertisement

Kajal Aggarwal | హీరోయిన్‌గా క‌మ్‌బ్యాక్ కోసం అందాల చంద‌మామ‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ తెగ క‌ష్ట‌ప‌డుతోంది. త‌న‌కు వ‌చ్చిన చిన్న అవ‌కాశాల‌ను కూడా వ‌దిలిపెట్ట‌డం లేదు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే గ్యాప్‌లో త‌న కొత్త సినిమాను ప్ర‌మోట్ చేస్తోంది. ఈ అమ్మ‌డి అంకిత‌భావంపై నెటిజ‌న్ల‌తో పాటు మేక‌ర్స్ తెగ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

హైద‌రాబాద్‌లో షూటింగ్‌....

ప్ర‌స్తుతం కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలుగులో బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తోంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్‌డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. బాల‌కృష్ణ‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని చిత్రీక‌రిస్తున్నారు.

ది ఇండియా స్టోరీ...

బాల‌కృష్ణ మూవీ షూటింగ్ బిజీలో ఉంటూనే మ‌రోవైపు త‌న అప్‌క‌మింగ్ మూవీ ది ఇండియా స్టోరీని ప్ర‌మోట్ చేస్తుంది. షూటింగ్ బ్రేక్ టైమ్‌లో ఇంట‌ర్వ్యూలు, చిట్‌చాట్‌ల‌లో పాల్గొంటుంది. చాలా మంది హీరోయిన్లు షూటింగ్‌లో ఉంటే ప్ర‌మోష‌న్స్‌ను స్కిప్ చేస్తుంటారు. కానీ కాజ‌ల్ మాత్రం తాను అంగీక‌రించిన బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పూర్తిచేస్తోంది. . కాజ‌ల్ ప‌డుతోన్న క‌ష్టంపై ది ఇండియా స్టోరీ మేక‌ర్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతోన్నారు.

లాయ‌ర్ పాత్ర‌లో...

ది ఇండియా స్టోరీ మూవీలో కాజ‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. పురుగు మందుల వాడ‌కం వ‌ల్ల త‌లెత్తిన అన‌ర్థాల‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో శ్రేయ‌స్ త‌ల్ఫ‌డే కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చేత‌న్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జూలై 24న హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ది ఇండియా స్టోరీ రిలీజ్ కాబోతుంది.

బాల‌కృష్ణ మూవీతో...

మ‌రోవైపు బాల‌కృష్ణ మూవీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది కాజ‌ల్‌. ఈ సినిమాలో తొలుత న‌య‌న‌తార‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. కానీ బ‌డ్జెట్ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల న‌య‌న‌తార‌ను ప‌క్క‌న‌పెట్టి కాజ‌ల్‌కు ఛాన్స్ ఇచ్చారు. భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత బాల‌కృష్ణ‌, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

 

 

Advertisement
Advertisement