త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Panchayat Elections | భ‌ర్త స‌ర్పంచ్.. భార్య ఉప‌స‌ర్పంచ్..

Panchayat Elections | ఇటీవ‌ల జ‌రిగిన గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకున్నాయి. అత్తాకోడ‌ళ్ల మ‌ధ్య‌, తండ్రీకొడుకుల మ‌ధ్య‌, తోటి కోడ‌ళ్ల మ‌ధ్య‌, త‌ల్లీబిడ్డ‌ల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ఉండే. వీరిలో ఒక్క ఓటుతో గెలిచిన వారు ఉన్నారు.. కొంద‌రు భారీ మెజార్టీతో గెలిచిన వారు ఉన్నారు.

S

Telangana | Published On Dec 18, 2025, 6.33 pm IST

Panchayat Elections | భ‌ర్త స‌ర్పంచ్.. భార్య ఉప‌స‌ర్పంచ్..
Advertisement

Panchayat Elections | ఇటీవ‌ల జ‌రిగిన గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకున్నాయి. అత్తాకోడ‌ళ్ల మ‌ధ్య‌, తండ్రీకొడుకుల మ‌ధ్య‌, తోటి కోడ‌ళ్ల మ‌ధ్య‌, త‌ల్లీబిడ్డ‌ల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ఉండే. వీరిలో ఒక్క ఓటుతో గెలిచిన వారు ఉన్నారు.. కొంద‌రు భారీ మెజార్టీతో గెలిచిన వారు ఉన్నారు. మొత్తానికి ఎన్నిక‌ల్లో గెలుపొంది స‌ర్పంచ్, ఉప‌స‌ర్పంచ్ ప‌ద‌వుల‌ను అలంక‌రింబోతున్నారు.

తెలంగాణ గ్రామ పంచాయ‌తీ మూడో విడ‌త ఎన్నిక‌ల్లో సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్ మండల ప‌రిధిలోని జ‌గ‌న్నాథ‌పూర్ గ్రామంలో విచిత్రం చోటు చేసుకుంది. స‌ర్పంచ్ ప‌ద‌వి కోసం పోటీ చేసిన బీర‌దార్ విజయ్ కుమార్ గెలుపొందారు. అయితే జ‌గ‌న్నాథ‌పూర్ గ్రామంలో మొత్తం ఏడు వార్డులు ఉన్నాయి. నాలుగో వార్డు నుంచి బీర‌దార్ విజ‌య్ కుమార్ భార్య కూడా బ‌రిలో దిగి మొత్తానికి విజ‌యం సాధించింది.

అయితే ఉప స‌ర్పంచ్ ఎన్నిక విష‌యంలో ఏడుగురు వార్డు సభ్యుల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. చివ‌ర‌కు నాలుగో వార్డు నుంచి గెలుపొందిన శోభ(విజ‌య్ కుమార్ భార్య‌) ను ఉప స‌ర్పంచ్‌గా ఎన్నుకున్నారు. దీంతో భ‌ర్త స‌ర్పంచ్ కాగా, భార్య‌ను ఉప‌స‌ర్పంచ్ ప‌ద‌వి వ‌రించింది. మొత్తంగా భార్యాభ‌ర్త‌ల‌కే ఉప‌స‌ర్పంచ్, స‌ర్పంచ్ ద‌క్క‌డంతో ఈ దంప‌తుల గురించి జిల్లా వ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement