త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram Jatara | జ‌న‌సంద్రంగా మేడారం.. వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి పోటెత్తిన భ‌క్తులు

Medaram Jatara | మేడారం మ‌హా జాత‌ర (Medaram Jatara) ప‌రిస‌రాలు జ‌న‌సంద్రంగా మారాయి. గురువారం రాత్రి స‌మ్మ‌క్క త‌ల్లి గ‌ద్దెపైకి చేర‌డంతో జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం ముగిసింది.

G

Telangana | Published On Jan 30, 2026, 7.46 am IST

Medaram Jatara | జ‌న‌సంద్రంగా మేడారం.. వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి పోటెత్తిన భ‌క్తులు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మేడారం మ‌హా జాత‌ర (Medaram Jatara) ప‌రిస‌రాలు జ‌న‌సంద్రంగా మారాయి. గురువారం రాత్రి స‌మ్మ‌క్క త‌ల్లి గ‌ద్దెపైకి చేర‌డంతో జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం ముగిసింది. దీంతో వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. జంప‌న్న వాగులో స్నానాలు ఆచరించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో కిలోమీటర్ల కొద్ది వాహ‌నాలు నిలిచిపోయాయి. దీంతో భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం వ‌ర‌కు 80 ల‌క్ష‌ల మంది మేడారం జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చిన విష‌యం తెలిసిందే. శ‌నివారంతో మ‌హాజాత‌ర ముగియ‌నుండ‌టంతో భ‌క్తుల సంఖ్య మరింత పెరుగ‌నుంది.

కాగా, మేడారం జాతరలో భక్తులంతా ఎదురుచూసిన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు ఎంతో ఆసక్తిగా చూసే అమ్మవారు సమ్మక్క గద్దెలపై కొలువుదీరారు. అనంతరం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అంతకుముందు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం ప్రారంభమవడంతో.. ఆ తల్లికి గౌరవసూచకంగా ములుగు జిల్లా ఎస్పీ రాంనాథ్​ కేకన్​ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు సమ్మక్క తల్లికి గౌరవ వందనం సమర్పించారు.

చిలకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లికి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఘనస్వాగతం పలికారు. భక్తులు సమ్మక్కకు జై అంటూ నినాదాలు చేశారు. భక్తుల జయజయధ్వానాలతో సమ్మక్క గద్దెలపైన కొలువుదీరింది. గద్దెలపై వనదేవతలు కొలువుదీరడంతో ప్రధాన ఘట్టం పూర్తి అయ్యింది. బుధవారమే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరిన సంగతి తెలిసిందే. శనివారం వనదేవతల వన ప్రవేశంతో మేడారం జాతర పూర్తికానుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement