త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram Jatara | నేటి నుంచి మేడారం మహా జాతర హుండీల లెక్కింపు.. ఆదాయం ఎంతొచ్చేనో?

Medaram Jatara | ఆసియాలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర మేడారం (Medaram Jatara) స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ మ‌హా జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. గ‌త నెల 28 నుంచి 31 వ‌ర‌కు కొన‌సాగిన ఈ ఆధ్యాత్మిక సంబురానికి కోటిన్న‌రకుపైగా భ‌క్తులు హాజ‌ర‌య్యారు.

G

Telangana | Published On Feb 5, 2026, 10.23 am IST

Medaram Jatara | నేటి నుంచి మేడారం మహా జాతర హుండీల లెక్కింపు.. ఆదాయం ఎంతొచ్చేనో?
Advertisement

Medaram Jatara | త్రినేత్ర‌.న్యూస్‌: ఆసియాలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర మేడారం (Medaram Jatara) స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ మ‌హా జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. గ‌త నెల 28 నుంచి 31 వ‌ర‌కు కొన‌సాగిన ఈ ఆధ్యాత్మిక సంబురానికి కోటిన్న‌రకుపైగా భ‌క్తులు హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వం మేడారం గ‌ద్దెల‌ను ఆధునీక‌రించ‌డంతో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో మహా జాతర హుండీలను నేటి నుంచి లెక్కించ‌నున్నారు. దీనికోసం హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం నుంచి హనుమకొండకు 827 హుండీలను తరలించారు. లెక్కింపులో 100 మంది సిబ్బంది పాల్గొనున్నారు. హుండీ లెక్కింపుకు 15 రోజుల పైనే పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్న‌ది. గత మహా జాతరలో హుండీ ద్వారా రూ.13 కోట్ల‌కుపైగానే ఆదాయం స‌మ‌కూరింద‌ని అధికారులు తెలిపారు. ఈ జాతరలో మరింత పెరుగుతుందని అంచ‌నావేస్తున్నారు.

నేడు మేడారానికి జాతీయ మహిళా కమిషన్ సభ్యులు..

మ‌రోవైపు మేడారంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన విష‌యం తెలిసిందే. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను సుమోటాగా తీసుకున్న కమిషన్.. డెలినా ఖోంగ్డస్ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటుచేసింది. ఈ నెప‌థ్యంలో క‌మిటీ స‌భ్యులు గురువారం మేడారం రానున్నారు.

Advertisement
Advertisement